లేడీ డైనమైట్ ఏక్తా కపూర్ నిర్మించిన `ది డర్టీ పిక్చర్` బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టి బాలీవుడ్ సహా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. విజయవాడ(ఏపీ)కు చెందిన ఒక తెలుగమ్మాయి కథతో ఒక హిందీ నిర్మాత.. అందునా ఒక లేడీ ప్రొడ్యూసర్ 100 కోట్లు కొల్లగొట్టడం టాలీవుడ్ ప్రముఖులకు కనువిప్పుగా మారింది. అదే క్రమంలో తమకు ఈ ఆలోచన ఎందుకు రాలేదో అంటూ దర్శకరచయితల్లో కొందరు బుర్రలు బాదుకున్నారు!
ది డర్టీ పిక్చర్ నిజానికి అప్పట్లో బాలీవుడ్ స్థాయిని పెంచింది. నాయికా ప్రధాన సినిమాలతో 100 కోట్లు కొల్లగొట్టవచ్చని నిరూపించింది. ఈ చిత్రం స్త్రీ పాత్ర చుట్టూ ఉన్న అత్యంత సాహసోపేతమైన సంబంధాల కథతో తెరకెక్కిన ఏకైక బోల్డ్ చిత్రంగా నిలిచింది. కథానాయికగా నటించిన విద్యాబాలన్... సిల్క్ స్మిత గా అదరగొట్టింది. ఆమె కెరీర్ లో అత్యంత విశిష్టమైన పాత్ర ఇది. నటిగా గొప్ప ప్రశంసలు అందుకుంది. ఈ మూవీలో నటించాక విద్యాబాలన్ జాతీయ ఉత్తమ నటి పురస్కారం తో పాటు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం దక్కించుకోవడం చర్చనీయాంశమైంది. తాజా సమాచారం మేరకు ఈ సినిమాకు సీక్వెల్ తీయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏక్తాకు చివరకు ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించాలనే ఆలోచన వచ్చింది. విద్యాబాలన్ కు కుదరకపోవడంతో ఆమె కంగనా రనౌత్ తో సినిమా చేయాలనుకుంటోంది! అంటూ ప్రచారం సాగుతోంది.
2011లో విడుదలైన ఈ చిత్రం తెలుగు ఐటమ్ గాళ్ సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్. మిలన్ లుథ్రియా దర్శకత్వం వహించారు. ఇందులో ఇమ్రాన్ హష్మీ- నసీరుద్దీన్ షా- తుషార్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆ సమయంలో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 117 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం ఉత్తమ నటి సహా మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు .. ఆరు స్క్రీన్ అవార్డులు సహా మూడు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది.
చాలా కాలంగా.. నిర్మాత ఏక్తా కపూర్ డర్టీ పిక్చర్ సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నా ఆలస్యమైంది. ఇప్పటికి ఈ చిత్రానికి సరైన స్క్రిప్ట్ ను లాక్ చేసారని తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో విద్యాబాలన్ కనిపించదు. కంగనకు ఛాయిస్ లేదు. బదులుగా తాప్సీ పన్ను లేదా కృతి సనన్ కథానాయికలుగా నటించడానికి ఆసక్తిని కనబరిచారని తెలుస్తోంది. మరోవైపు ఈ పాత్రలో లాక్ అప్ హోస్ట్ కంగనా రనౌత్ ను నటింపజేయాలని ఏక్తా చాలా ట్రై చేసింది. అయితే కంగన వ్యక్తిగత కారణాల వల్ల ఆ పాత్రను తిరస్కరించింది.
చాలా కాలం పాటు అన్వేషించిన తర్వాత ఏక్తా చివరకు కనికా థిల్లాన్ తో కలిసి డర్టీ పిక్చర్ 2 కథను రెడీ చేయించింది. మన్మర్జియాన్- హసీన్ దిల్ రూబా- జడ్జిమెంటల్ హై క్యా - రష్మీ రాకెట్ వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన నాయికా ప్రధాన కథల రచయితగా కనికా ధిల్లాన్ కి మంచి గుర్తింపు ఉంది. అందుకే ఈ చిత్రానికి రైటర్ గా ఎంపిక చేసారు. కనిక ప్రముఖ మేల్ రచయితతో కలిసి స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తోంది. ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. బాలాజీ మోషన్ పిక్చర్స్ లో ఏక్తా బృందం ఈ ప్రత్యేక ప్రాజెక్ట్ గురించి ఉత్సాహంగా ఉన్నారు. 2023 మొదటి త్రైమాసికంలో దీన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు.
ఒక సోర్స్ ప్రకారం... ఏక్తా కంగనా రనౌత్ ను నటింపజేయాలని భావించింది.. కానీ కంగనకు ఇమేజ్ సమస్య తలెత్తింది. తన నీతివంతమైన ఇమేజ్ కి భంగం కలిగించకూడదనుకోవడంతో ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందని కథనాలొస్తున్నాయి..ఇప్పుడు తాప్సీ లేదా కృతి ..! ఇద్దరిలో ఎవరికి ఛాన్స్ అనేది తేలాల్సి ఉంది. ఇతర నాయికలు కూడా తమ ఆసక్తిని వ్యక్తం చేశారు. అయితే స్క్రిప్టు రచన పూర్తయ్యే వరకు వేచి ఉండమని ఏక్తా వారిని అభ్యర్థించారు. మిలన్ లుథ్రియా మళ్లీ డైరెక్టర్ గా కొనసాగుతారా లేదా ఈసారి మరొకరు దీనికి దర్శకత్వం వహిస్తారా? అనేది ఇంకా అస్పష్టంగా ఉంది.. అని తెలిసింది.
డర్టీ పిక్చర్ 2 వైవిధ్యమైన కథతో తెరకెక్కుతుందని కూడా టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే పార్ట్ వన్ లో విద్యాబాలన్ పాత్ర చివరికి మరణిస్తుంది. భవిష్యత్తు చిత్రానికి స్కోప్ లేదు. ప్రస్తుతానికి సీక్వెల్ కు సంబంధించిన ప్రతిదీ ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఏక్తా కపూర్ త్వరలో అధికారిక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. ఈ సీక్వెల్ బోల్డ్ గా.. s*xy గా ఉంటుందట.. ఒక శక్తివంతమైన మహిళామణి రంగురంగుల జీవితానికి సంబంధించిన కథను అడాప్ట్ చేసారని కూడా తెలుస్తోంది. డర్టీ పిక్చర్ 2 లో చివరకు విద్యాబాలన్ పాత్రలోకి ఎవరు ప్రవేశిస్తారో చూడాలని అంతా వేచి చూస్తున్నారు.