తొలి సంపాదన అనేది ఎవరికైనా ప్రత్యేకమే. దాన్ని ఎలా ఖర్చు పెట్టామన్నది ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. గాన గంధర్వుడు కూడా గాయకుడిగా తన తొలి సంపాదన తాలూకు జ్ఞాపకాల్ని పదిలంగా దాచుకున్నారు. ఆ విశేషాలు తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్నారు. ‘శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న’ సినిమాలో పాడిన పాటకు గాను ఆయన అప్పట్లోనే 300 రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నారట. ఆ రోజుల్లో లెజెండరీ సింగర్ ఘంటసాల ఒక పాటకు 500 తీసుకునేవారట. అలాంటిది తనకు రూ.300 పారితోషకం ఇవ్వడం గొప్ప విషయమన్నారు బాలు. అప్పట్లో తనకు ఇంటి నుంచి ఖర్చుల కోసం నెల నెలా 80 రూపాయలు వచ్చేవని.. తనకు రెమ్యూనరేషన్ రావడంతో నాలుగు నెలల పాటు ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకోవాల్సిన పని లేదని ఆనంద పడ్డానని చెప్పారు బాలు.
ఇక తన తొలి పారితోషకాన్ని తనకు నచ్చిన విధంగా ఖర్చు పెట్టానన్నారు. తన ఫ్రెండ్ మురళితో కలిసి మద్రాసులోని డ్రైవ్ ఇన్ వుడ్ ల్యాండ్స్ రెస్టారెంటుకు వెళ్లి గులాబ్ జామూన్.. మసాలా దోశె తిన్నామని.. అలాగే అదే రోజు జేమ్స్ బాండ్ సినిమా కూడా చూశామని చెప్పారు. మామూలుగా 85 పైసల టికెట్ కు వెళ్లే తాము.. ఆ రోజు మాత్రం రూపాయి పావలా టికెట్లు తీసుకున్నామన్నారు. అలాగే కోక్ కూడా తాగామని.. ఎప్పట్లా వన్ బై టు కాఫీ కాకుండా చెరో కాఫీ కూడా సేవించామన్నారు. ఆ తర్వాత తాను ఒక కన్నడ పాట పాడానని.. దానికి మాత్రం 150 రూపాయలే పారితోషకంగా ఇచ్చారని బాలు తెలిపారు. అది తక్కువ అని తన ఫ్రెండ్ అన్నాడని.. కానీ అప్పట్లో వంద రూపాయలు కూడా పెద్ద విషయమే కాబట్టి తానేమీ ఫీలవ్వలేదని బాలు తెలిపారు. ముందు ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకోకుంటే చాలు అనుకున్న తాను.. తర్వాతి కాలంలో తనే ఇంటికి డబ్బులు పంపే స్థాయికి చేరుకున్నానని చెప్పారు.