టాలీవుడ్ పవర్ ఫుల్ కాంబినేషన్స్ లో ఒకటి నందమూరి బాలకృష్ణ - బోయపాటి శీను పెయిర్. ఏ కాంబినేషన్ లో చివరి సినిమా వచ్చి దాదాపు ఏడేళ్లు అవుతుంది. ఇన్నేళ్ల తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ తెరమీద సందడి చేయడానికి సిద్ధం అవుతోంది. నిజానికి బాలయ్య ప్లాప్స్ లో ఉన్నప్పుడల్లా బోయపాటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి ఆదుకున్నాడు. ముచ్చటగా మూడోసారి ఈ స్టార్ కాంబోబాక్సాఫీసును షేక్ చేసేందుకు మే 28న బిబి3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతేడాది బాలయ్య పుట్టినరోజున సందర్బంగా స్పెషల్ ప్రోమో రిలీజ్ చేసి సర్ప్రైజ్ చేసాడు బోయపాటి. ఆ ప్రోమో చూస్తేనే అర్ధమవుతుంది బాలయ్య ఎంత పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడో.. ఆ వీడియో ఇప్పటికి ట్రెండింగ్ లోనే ఉంది. అయితే బోయపాటి పై బాలయ్యకు బాలయ్య పై బోయపాటికి చాలా నమ్మకం.
అందుకే బోయపాటి సినిమాలో ఎలాంటి రిస్క్ అయినా చేసేస్తాడు బాలయ్య. అయితే బాలయ్య బోయపాటి కాంబినేషన్ అంటేనే హీరో డ్యూయెల్ రోల్ లో కనిపిస్తాడని టాక్ ఉంది. ఆ టాక్ మళ్లీ నిజం చేస్తున్నారు ఈ స్టార్ కాంబో. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు మంచి విజయం సాధించటంతో ఈ బిబి3 సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ చిత్రబృందం కర్ణాటకలోని దండేలి అడవికి వెళ్ళింది. ఆ షెడ్యూల్ ఈరోజే ప్రారంభం కానుండగా.. బాలయ్యతో పాటు హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్.. ఇతర తారాబృందం అంతా దండేలి చేరుకున్నారు. తొమ్మిది రోజులపాటు ఈ షెడ్యూల్ సాగనుండగా.. ఇక్కడే క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ షూట్ చేస్తారని సమాచారం. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో పూర్ణ విలన్ రోల్ చేస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు.