అనిల్ ప్లాన్ కు బాలయ్య ఏమన్నాడు?

Update: 2022-08-09 13:30 GMT
కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు తో మంచి గుర్తింపు అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాను నందమూరి బాలకృష్ణ తో చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలకృష్ణ తన 107వ ప్రాజెక్టును గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నాడు.

ఆ ప్రాజెక్టుకు జై బాలయ్య అనే టైటిల్ సెట్ చేయాలని అనుకుంటున్నారు. అయితే 108వ ప్రాజెక్ట్ విషయంలో కూడా బాలకృష్ణ ఇదివరకే ఉన్న ఒక నిర్ణయానికి వచ్చారు. యువ దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పిన స్టోరీ లైన్ బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

ఇక దర్శకుడు ప్రస్తుతం పూర్తిస్థాయిలో స్క్రిప్టును సిద్ధం చేసే పనిలో బిజీ అయ్యాడు. అయితే బాలయ్య మాత్రం మళ్లీ స్క్రిప్ట్ పూర్తిగా సిద్ధమైన తర్వాతనే ఒకసారి చర్చలు జరపాలని కూడా చెప్పాడట.

ఇక రీసెంట్ గా అందులో భాగంగానే అనిల్ రావిపూడి వైజాగ్ కు వెళ్లి మరి బాలయ్య బాబుకు ఫస్ట్ అఫ్ గురించి పూర్తిగా వివరించారట. ఇక అతను సెట్ చేసుకున్న స్పీడ్ ప్లాన్ నచ్చడంతో బాలయ్య చాలా హ్యాపీగా ఫీల్ అయినట్లు తెలుస్తోంది.

అలాగే సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ కూడా ప్రస్తుతం సిద్ధం చేస్తున్న అనిల్ రావిపూడి రేపో మాపో దాన్ని కూడా పూర్తిచేసి బాలయ్యకు వివరణ ఇవ్వబోతున్నాడు. ఇక దాదాపు ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ స్క్రిప్ట్ తుది దశకు చేరుకుంటుంది. ఇక బాలయ్య బాబు కూడా ఆ ప్రాజెక్టును మొదలుపెట్టడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య బాబు 45 ఏళ్లకు పైబడిన ఒక మిడిల్ ఏజ్ పవర్ఫుల్ లీడర్ గా కనిపించబోతున్నాడు.

ఇక ఆయనకు కూతురు పాత్రలో పెళ్లి సందడి హీరోయిన్ శ్రీ లీల నటించబోతోంది. అలాగే మరొక సీనియర్ హీరో కూడా నెగిటివ్ పాత్రలో కనిపిస్తారు అని టాక్ అయితే వినిపించింది గాని ఇంకా పూర్తి నటీనటుల విషయంలో అయితే దర్శకుడు ఫైనల్ నిర్ణయం తీసుకోలేదు. ఇక త్వరలోనే ఈ ప్రాజెక్టు సంబంధించిన షూటింగ్ అప్డేట్ రిలీజ్ డేట్ పై కూడా ముందుగానే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News