మహేష్ ఈ షో కోసం కూడా ఎదురు చూపులు తప్పవా?

Update: 2021-12-16 10:30 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబును బుల్లి తెరపై చూడటం చాలా చాలా అరుదు. ఆయన ఇటీవల ఎన్టీఆర్ హోస్ట్‌ చేసిన ఎవరు మీలో కోటీశ్వరుడు షో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బుల్లి తెరపై మహేష్ బాబు వచ్చిన ఎపిసోడ్‌ కు మంచి ఆధరణ దక్కింది. దాంతో రేటింగ్‌ భారీ స్థాయిలో నమోదు అయ్యింది అనేది టాక్.

ఎన్టీఆర్‌ రియు మహేష్ బాబు ఎపిసోడ్‌ ను షూట్‌ చేసిన దాదాపు రెండు మూడు నెలల తర్వాత కాని టెలికాస్ట్‌ చేయలేదు. మొదట దసరా అన్నారు.. ఆ తర్వాత దీపావళి అన్నారు.. చివరకు ఒక సండే టెలికాస్ట్‌ చేయడం జరిగింది. మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఆ ఎపిసోడ్‌ ను వాయిదా వేస్తూ వచ్చి వచ్చి సరైన సమయం కోసం వేయిట్ చేశారు. మహేష్ బాబు మరో షో కోసం కూడా ఎదురు చూపులు తప్పేలా లేవు అనిపిస్తుంది.

మహేష్‌ బాబు స్పెషల్‌ గెస్ట్ గా బాలయ్య అన్‌ స్టాపబుల్‌ షో షూటింగ్‌ ఇప్పటికే పూర్తి అయ్యింది. బ్రహ్మానందం ఎపిసోడ్‌ తర్వాత మహేష్‌ బాబు ఎపిసోడ్‌ ఉంటుందని అంతా భావించారు. కాని అనూహ్యంగా అఖండ యూనిట్‌ సభ్యులు అన్‌ స్టాపబుల్ లో సందడి చేశారు. ఆ తర్వాత అయినా మహేష్‌ బాబు ఎపిసోడ్‌ ను స్ట్రీమింగ్‌ చేస్తారని అంతా ఆశించారు.

కాని ఈ వారం రాజమౌళి మరియు కీరవాణి లతో బాలయ్య సందడి చేయబోతున్నాడు. అందుకు సంబంధించిన ప్రోమో కూడా వచ్చేసింది. తదుపరి వారం మహేష్‌ బాబు ఎపిసోడ్‌ వస్తుందేమో అని మళ్లీ ఎదురు చూస్తున్నారు. కాని విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఎపిసోడ్‌ ను రవితేజతో చేస్తారనే వార్తలు వస్తున్నాయి.

బాలయ్య అన్‌ స్టాపబుల్‌ లో గెస్ట్‌ ల జాబిత చాలా పెద్దగా ఉంది. కనుక రాబోయే కొన్ని వారాల వరకు మహేష్‌ బాబు ఎపిసోడ్‌ ను స్ట్రీమింగ్‌ చేసే అవకాశాలు తక్కువే అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. సంక్రాంతి వరకు ఆహా వారు మహేష్ బాబు ఎపిసోడ్‌ ను వాయిదా వేస్తూ వచ్చి అప్పుడు స్ట్రీమింగ్‌ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.

మరి బాలయ్య నిర్ణయం ఏంటీ.. ఆహా వారు ఏం అనుకుంటున్నారు అనేది చూడాలి. బాలయ్య అన్‌ స్టాపబుల్‌ లో ఇప్పటి వరకు మోహన్‌ బాబు.. నానిలు సందడి చేశారు. రెండు వారాల తర్వాత బాలయ్య చేతికి ఆపరేషన్‌ అవ్వడం వల్ల షో కు బ్రేక్ వచ్చింది.

మూడవ ఎపిసోడ్ ను బ్రహ్మానందం మరియు అనీల్ రావిపూడితో చేయగా నాల్గవ ఎపిసోడ్ ను అఖండ విజయంతో ఆ చిత్ర యూనిట్‌ సభ్యులతో బాలయ్య అన్ స్టాపబుల్‌ షో చేశాడు. అయిదవ ఎపిసోడ్ ను ఆర్‌ ఆర్‌ ఆర్‌ ప్రమోషన్ లో భాగంగా రాజమౌళి మరియు కీరవాణిలతో చేయడం జరుగింది.

Tags:    

Similar News