ఎగిరే .. పై కెగిరే .. ఆకాశం తాకేలా.. అంటూ పాడుకోవడానికి చిరంజీవి యువత రెడీ అవుతున్నారు. ఆగష్టు 22 మెగా-డే. అన్నయ్య చిరంజీవి పుట్టిన రోజు. ఈసారి పుట్టిన రోజు వెరీ స్పెషల్. అందుకే ఇప్పటినుంచి సంబరాలకు మెగా ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. 150వ సినిమా ప్రకటన గ్రాండ్ లెవల్ లో ఉండాలని మెగా ఫ్యాన్స్ తపిస్తున్నారు. చిరు రీఎంట్రీ కోసం అటు మెగా ఫ్యామిలీ, ఇటు ఫ్యాన్స్ క్షణక్షణం ఉత్కంఠ తో గడుపుతున్నారు.
ఇదిగో సంబరాలకు తెర తీసేముందు ఓ 'బెలూన్'ను గాల్లోకి ఎగరే సేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 'పద్మభూషణ్ డా.కె.మెగాస్టార్ చిరంజీవి గారికి.. జన్మదిన శుభాకాంక్షలు, రాష్ట్ర చిరంజీవి యువత' అంటూ ఓ గాలిబుడగ పై ముద్రించి ఆకాశంలోకి ఎగరే సేందుకు రెడీ అవుతున్నారు. హైదరాబాద్ జూబ్లీ చెక్ పోస్ట్ పరిసరాల్లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద ఈ బుడగ ఆకాశ హార్మ్యాల్ని మించిన ఎత్తులో ఎగరబోతోంది. మెగా బి-డే కి జేగంట మోగినట్టే ఇక. ఫ్యాన్సంతా అలెర్టు గా ఉన్నారు. ఇక ప్రపంచాన్ని మెల్కొలపడానికి. మెగాస్టార్ ఘనమైన రీఎంట్రీ ని చాటడానికి.
అయితే అభిమానుల సైడ్ నుండి ఈ రేంజు ఎరేంజ్ మెంట్లు జరుగుతున్నా కూడా మెగాస్టార్ సైడ్ నుండి మాత్రం అసలు 150వ సినిమా గురించి ఏ ఒక్క న్యూస్ కూడా వినిపించకపోవడం కాస్త నిరాశపరిచే విషయం. మరో 5 రోజుల్లో మరి ఈ సినిమా గురించి ఏదైనా చెప్తారేమో చూడాలి.