పవన్ కళ్యాణ్ అనే పేరు వినిపిస్తే చాలు... నా దేవుడు, నా ఇలవేల్పు అంటూ ఊగిపోతుంటాడు బండ్ల గణేష్. ఎప్పుడు ఏ వేదికనెక్కినా, ఏ చిన్న అవకాశం వచ్చినా పవన్ నామ జపం చేయాల్సిందే. బండ్ల గణేష్ నరనరాన పవన్ కళ్యాణే ఉన్నాడేమో అనిపిస్తుంటుంది. `గబ్బర్ సింగ్`లాంటి సినిమాని తనకి ఇచ్చాడని పవన్ ని ఆకాశానికెత్తేస్తుంటాడు బండ్ల. మళ్లీ పవన్ తో సినిమా చేసే అవకాశం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నాడు. పెద్ద నిర్మాతగా పేరు తెచ్చుకొన్నా ఒక అభిమానిగానే పవన్ కళ్యాణ్ పై ప్రేమాభిమానాల్ని ప్రదర్శిస్తుంటాడు. అలాంటి బండ్ల గణేష్ తన అభిమాన కథానాయకుడైన పవన్ కళ్యాణ్ కి బర్త్‌డే విషెస్ ఎలా చెబుతాడు? ఒక రేంజ్‌లో చెబుతాడు కదా! అదే చేశాడు. మంగళవారం రాత్రే అడ్వాన్సుగా పవన్ కళ్యాణ్ కి ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పాడు బండ్ల. అది కూడా ప్రత్యేకంగా పోస్టర్ లు డిజైన్ లు చేయించి మరీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు.
బండ్ల గణేష్ డిజైన్ చేయించిన పోస్టర్ లలో కొటేషన్ లు అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. బండ్ల పంచుల్లో పవర్, పవన్ పై ఆయనకున్న ప్రేమ పోస్టర్ లలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. `తెలుగు జాతి జెండా... రైతుజాతి ఎజెండా, నా గుండెల్లో కొలువున్న కోటప్ప కొండ, నా దైవ సమానులైన పవన్ కళ్యాణ్` అంటూ కొటేషన్లు సిద్ధం చేయించి మరీ విషెస్ చెప్పాడు బండ్ల. ఇంకా పోస్టర్ లలో అలాంటి కొటేషన్ లు బోలెడన్ని ఉన్నాయి. వాటిని చూసిన జనాలు `బండ్ల గణేష్ పవన్ మనసుని దోచుకొనేందుకు బాగానే వర్కవుట్ లు చేశాడ`ని మాట్లాడుకొంటున్నారు.