పవన్ కళ్యాణ్ తో సినిమా కన్ఫర్మ్ అయిన తర్వాత మొదలు పెట్టడానికి టైమ్ పడుతున్నప్పుడు ఖచ్చితంగా దర్శకులు పిచ్చెక్కి పోతారు. ప్రేయసి రాక కోసం ప్రియుడు ఎంత విరహ వేదనతో ఎదురు చూస్తాడో అంతే ఇంట్రెస్ట్ గా.. అదే మోజుతో పవన్ డేట్ల కోసం దర్శకులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు దర్శకుడు హరీష్ శంకర్ పరిస్థితి అలాగే ఉంది. గతంలో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించిన హరీష్ శంకర్ త్వరలో పవన్ తో ఒక సినిమా ను చేసేందుకు దాదాపుగా రెండేళ్లుగా వెయిట్ చేస్తున్నాడు. వీరిద్దరి కాంబో మూవీ కన్ఫర్మ్ అయినప్పటి నుండి కరోనా కారణంగా అదుగో ఇదుగో అన్నట్లుగా వాయిదాలు పడుతూనే ఉంది.
ఇటీవల దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్ లో పవన్ తో ఉన్న ఫొటోను షేర్ చేసి.. మీతో మళ్లీ వర్క్ చేయడం కోసం ఆగలేక పోతున్నాను అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు బండ్ల గణేష్ కూడా స్పందించాడు. నేను కూడా సర్ అంటూ పవన్ తో మూవీ కోసం ఎదురు చూస్తున్నట్లుగా బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు. మొత్తానికి పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం వీరిద్దరు పడుతున్న ఆరాటం కనిపిస్తుంది. హరీష్ శంకర్ తో సినిమా కన్ఫర్మ్ అయ్యింది. ఒకటి రెండు నెలల్లో సినిమా పట్టాలెక్కబోతుంది. కాని బండ్ల గణేష్ సినిమా పరిస్థితి ఏంటీ అనేది మాత్రం క్లారిటీ లేదు.
కొన్ని నెలల క్రితం మళ్లీ నా దేవుడితో సినిమా చేయబోతున్నాను అంటూ బండ్ల గణేష్ ప్రకటించాడు. కాని సినిమా ఎప్పుడు ఉంటుందనేది మాత్రం చెప్పలేక పోతున్నాడు. బండ్ల కు నిజంగానే పవన్ ఓకే చెప్పాడా.. డేట్లు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాడా అంటే అనుమానమే అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాని బండ్ల మాత్రం తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నాడు.. ఉంటాడు.