అవును .. తాను కొలిచే ఇలవేలుపు దైవంపైనే బండ్ల గణేష్ ఒట్టేశారు. ఇదేమి సిత్రమో కానీ ఇది నిజం. ఓ టీవీ చానెల్ లైవ్ సాక్షిగా బండ్ల తన ఇష్టదైవం పవన్ కల్యాణ్ పైనే ఒట్టేయడం అభిమానుల్లో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇంతకీ బండ్ల ఒట్టేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే చానెల్ హోస్ట్ అలా నిలదీశారు మరి.
చిరంజీవి గారు.. పవన్ .. నాగబాబు వీళ్లకు నచ్చకపోవడం వల్లనే మీరు ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి బయటికి వచ్చారు అని ప్రచారం సాగుతోంది. ఇది నిజమా? అంటే .. ఏ దేవుడి మీద ఒట్టేసి చెప్పమంటారు? అంటూ.. బండ్ల గణేష్ ఏకంగా తన ఇష్టదైవం పవన్ పైనే ఒట్టేసి అసలు మెగా బ్రదర్స్ కి ఇందులో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. వట్టి పుణ్యానికి చిరంజీవి గారి పేరు లాగడం సరికాదు. దయచేసి మీ అందరికీ దణ్ణం పెట్టి అడుగుతున్నా అని బండ్ల అన్నారు. మీలాగా పది మంది అడిగారు కాబట్టి మీ ద్వారా పది మందికి చేరాలనే చెబుతున్నాను.. అని అన్నారు.
ప్రకాష్ రాజ్ ప్యానల్ లోకి జీవితా రాజశేఖర్ ఎంట్రీ ఇవ్వడం నచ్చక మెగా ఫ్యామిలీయే బండ్ల గణేష్‌ను బయటకు రమ్మని చెప్పిందనే రూమర్ ని కొట్టి పారేసారు. ``పవన్ కల్యాణ్ గారి మీద ఒట్టు. నా తల్లిదండ్రులు.. బిడ్డల సాక్షిగా నన్ను ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి బయటకు రమ్మని చిరంజీవిగారు కానీ.. ఆ ఫ్యామిలీవాళ్లు గానీ ఎవరూ చెప్పలేదు. దయచేసి నన్ను నమ్మండి. నా మనస్సాక్షికి నచ్చకే నేను బయటకు వచ్చాను`` అని బండ్ల ఎమోషనల్ గా స్పందించారు. జీవితారాజశేఖర్ ఏం మాట్లాడినా క్షమించే మంచి గుణం మెగా ఫ్యామిలీకి ఉండొచ్చేమో కానీ తనకు ఉండదని అన్నారు. అందుకే జీవితపై జనరల్ సెక్రటరీగా పోటీ చేసి గెలుస్తానని అన్నారు.
మెగాహీరోలతో పవన్ తో ఎందుకంత బాండింగ్ అని ప్రశ్నిస్తే .. అది చెప్పాలంటే ఇప్పుడు రామకోటి రాయాలి. ఇప్పుడు ఎక్కడని రాయగలం! అంటూ బండ్ల అభిమానం చాటుకున్నారు. మరోవైపు బండ్ల ప్రకాష్ రాజ్ కి ప్రత్యర్థి అయిన మంచు విష్ణు ప్యానెల్ లో చేరతారని తామర తంపరగా కథనాలొస్తున్నాయి. దానిపైనా అతడు స్పందిస్తారేమో చూడాలి. ఇప్పటికి అతడు స్వతంత్రుడిగానే పోటీ చేస్తాడని అంతా భావిస్తున్నారు. అక్టోబర్ 10న మా ఎన్నికలు జరిగే వరకూ ఇంకా ఎన్ని సిత్రవిసిత్రాలు చూడాల్సి ఉంటుందో!!
జీవిత వెర్షన్ పూర్తిగా వేరే ఉందిగా!
మెగా ఫ్యామిలీ-జీవిత రాజశేఖర్ మధ్య చిన్నపాటి కలతలుండేవని మీడియాలో చాలాసార్లు హైలైట్ అయింది. అయినా మెగాస్టార్ చిరంజీవి ఏనాడు దీనిపై స్పందించింది లేదు. అలాగే జీవితారాజశేఖర్ కూడా మెగా ఫ్యామిలీతో గొడవలున్నాయని పబ్లిక్ గా చెప్పింది లేదు. కానీ మెగా ఫ్యామిలీని ముడిపెడుతూ చాలా కథనాలొచ్చాయి. ఆ ఫ్యామిలీతో జీవిత కుటుంబానికి వైరం ఉందని ప్రచారమైంది. జీవిత వెర్షన్ ఇటీవల ఇంచుమించు ఇలానే ఉంది. అసలు మెగా ఫ్యామిలీతో ఎలాంటి పొరపొచ్చాలు లేవని తాజాగా జీవిత వెల్లడించారు. ఒకవేళ ఉన్న అదంతా ముగిసిన అధ్యామన్నారు.
ఇక `మా` ఎన్నికల్లో బండ్ల గణేష్ తనికి ఇష్టమైన చోట పోటీ చేసే హక్కు ఉంది. ఆయన గురించి మాట్లాడాల్సిన పనిలేదన్నారు జీవిత. బండ్లతో తమకు ఎలాంటి విభేధాలు లేవని కూడా జీవిత స్పష్ఠం చేశారు. కానీ తమ దైవాల్ని కించపరిచిన జీవితపై పోటీకి దిగుతున్నారు బండ్ల.