బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ మెగా ఫ్యామిలీకి - పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి ఎంతటి సన్నిహితుడో తెలిసిందే. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని నిర్మించాడు. పవన్ అంటే చెవి కోసుకుంటాడు. బాస్ ఏం చెబితే అదే వింటాను.. అని బండ్ల స్వయంగా అంటాడు. అందుకే అతడు జనసేన పార్టీలో చేరతాడనే పవన్ అభిమానులు అంచనా వేసారు. అయితే బండ్ల ఊహించని రీతిలో కాంగ్రెస్ లో చేరడం చర్చకొచ్చింది.
నటుడు - నిర్మాత బండ్ల గణేష్ నేడు (శుక్రవారం) కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగే ఓ కార్యక్రమంలో రాహూల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరతారని తెలుస్తోంది. టీ పీసీసీ అధ్యక్షుడు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి - పలువురు సీనియర్ నేతలు సహా బండ్ల గణేష్ నిన్ననే దిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ తో పాటు ఆయా పార్టీల నుంచి పలువురు నాయకులు కాంగ్రెస్ లో చేరనున్నారని తెలుస్తోంది. తెలంగాణలో పవన్ కల్యాణ్ పార్టీ జనసేన ప్రాబల్యం లేకపోవడం వల్లనే బండ్ల ఈ నిర్ణయం తీసుకున్నాడనడంలో సందేహం లేదు.
ఇకపోతే షాద్ నగర్ బండ్ల గణేష్ ఇలాకా. అతడికి - అతడి కుటుంబ సభ్యులకు భారీగా కోళ్ల ఫారాల బిజినెస్ ఉందిక్కడ. ఆ పరిసరాల్లో గణేష్ కి ప్రజలతో సత్సంబంధాలున్నాయి. స్థానికుల నుంచి చక్కని అండదండలు ఉన్నాయి. అందుకే గత కొంతకాలంగా షాద్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బండ్ల గణేష్ ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని ప్రచారం సాగింది. అయితే అతడు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాడు? అన్నదానిపై సరైన క్లారిటీ లేదు. తాజాగా కాంగ్రెస్ లో చేరుతూ క్లారిటీ ఇచ్చేశాడు బండ్ల.