బండ్ల నోటి వెంట రికార్డుల మాటేది?

Update: 2015-07-16 09:30 GMT
బాహుబలి రికార్డుల మోత మోగిపోతోంది. అత్తారింటికి దారేది, మగధీర క్రియేట్‌ చేసిన రికార్డులన్నిటికీ కొట్టేసింది. మెగా హీరోకి ఒక్క రికార్డు కూడా లేనట్టే మరి. ఇదంతా ప్రభాస్‌, రాజమౌళి అండ్‌ గ్యాంగ్‌ చేసిన పని. మరి అలాంటప్పుడు శత్రువు అయినా సరే గొప్పవాడు అయినప్పుడు పొగిడి తీరాలి కదా.. కానీ టాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌ బండ్ల గణేష్‌ ఆ పని చేయలేదేం?

చినబాస్‌, పెద బాస్‌ (చరణ్‌బాబు, పవన్‌బాబు) అంటూ మెగా హీరోల తలలో పేనులాగా, తలగడలో నల్లిలాగా కొరికేసే బ్లాక్‌బస్టర్‌ గణేష్‌ బాహుబలి విషయంలో ఒక్క ప్రశంస కూడా కురిపించలేదేంటో మరి. ప్రభాస్‌ విషయంలో కనీసం ఒక్క ట్వీటైనా చేయడేం? ఇలాంటి సందేహాలెన్నో అభిమానులకు వస్తున్నాయిప్పుడు. బ్లాక్‌బస్టర్‌ ప్రొడ్యూసర్‌ బాహుబలి రికార్డులపై మాట వరసకైనా ఎందుకు ప్రస్తావించడు? అని ప్రశ్నిస్తున్నారంతా. అంతేనా? మెగా హీరో కాకపోతే రికార్డుల మాట నోట రాదా? అని కొందరు అడిగి కడిగేస్తున్నారు.

పాపం ఇటీవలే ముంబై పాన్‌ మసాలా ఓనర్‌ కం హీరో సచిన్‌ జోషి పోలీసు కేసులు, కోర్టు గొడవలు అంటూ గణేష్‌ని రచ్చకీడ్చాడు. అప్పట్నుంచి రికార్డుల మాటేమో గానీ, అసలు పల్లెత్తు మాటైనా మాట్లాడలేని పరిస్థితిలో గణేష్‌ పడిపోయాడని అనుకుంటున్నారు. మరి ఇప్పుడైనా కలుగులోంచి బైటికొస్తాడంటారా? రికార్డుల మాట ఎత్తుతాడంటారా?
Tags:    

Similar News