బ్లాక్ బస్టర్ గణేష్ అలియాస్ బండ్ల గణేష్ .. ఈయన కాన్సెప్టే వేరు. తీస్తే వరుసగా సినిమాలు తీసేస్తాడు. లేదంటే సైలెంటైపోతాడు. మెగా హీరోలు లైన్ లో ఉన్నారంటే చాలు వెంటనే అక్కడ వాలిపోతాడు. చకచకా పావులు కదిపేస్తాడు. కానీ ఈసారి అందుకు ఛాన్స్ రాలేదింకా. అప్పట్లో పవన్ హీరోగా 'గబ్బర్ సింగ్', చరణ్ హీరోగా గోవిందుడు అందరివాడేలే తెరకెక్కించాడు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ తో టెంపర్ తీశాడు. గోవిందుడు యావరేజ్ టాక్ వచ్చినా, టెంపర్ హిట్టయ్యింది. భారీ లాభాల్లేకపోయినా నష్టాలైతే రాలేదని అన్నారంతా. మరోసారి ఈ హీరోలతో సినిమాలు తీసేద్దామన్నా ఎవరూ అందుబాటులో లేరు. ఎవరి పనుల్లో వాళ్లు బిజీ.
మరి అలాంటప్పుడు బండ్ల ఇంకా స్లోమోషన్ లో ఎందుకు వెళుతున్నాడు? సినిమా రిలీజై చాలా కాలమే అయినా ఇంకా ఎందుకు అతడు సినిమా జోలికి వెళ్లడం లేదు? ఇటీవలి కాలంలో కోర్టు కేసులు, గొడవలు అతడిని బాగా ఇబ్బంది పెట్టాయని అనుకోవాలా? లేదూ బల్క్ గా క్యాష్ లేకపోవడం వల్ల స్టార్ హీరోతో సినిమా చేయలేకపోతున్నాడా? అప్పట్లో స్టార్ల తోనే కాదు, చిన్న హీరోలతోనూ సినిమాలు తీస్తాను, మనసు మార్చుకున్నా అని చెప్పాడు. స్టార్లు దొరక్కపోతేనైనా చిన్న హీరోలతో సినిమాలు తీసేస్తానని అన్నాడు. నిజమే ఇప్పుడు అందుకు అవకాశం ఉంది కదా! చిన్నవాళ్లకు ఓ ఛాన్సివ్వచ్చు కదా! ఏమన్నా అంటే అప్పుడప్పుడూ కొన్ని కాంట్రోవార్శీ ట్వీట్లు తప్పిస్తే మనోడు ఎక్కడా కనిపించడే అసలు.