పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు బండ్ల గణేష్ వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. ఆయన తనకు దైవంతో సమానం అని ఎన్నోసార్లు ఇప్పటికే చెప్పాడు..భవిష్యత్ లో చెప్తారు కూడా. అలాగే తన నిర్మాణంలో పవన్ కళ్యాణ్‌తో 'తీన్ మార్','గబ్బర్ సింగ్' వంటి సినిమాలు తీసారు. తీన్ మార్ సినిమా ఫ్లాప్ అయిందని పవన్ పిలిచి మరీ తనకు 'గబ్బర్ సింగ్' సినిమాకు అవకాశం ఇచ్చాడని బండ్ల గణేష్ ఎపుడు ఆనందంగా చెబుతుంటాడు. మొన్నటికి మొన్న వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ పంక్షన్ లోనూ అదిరిపోయే స్పీచ్ ఇచ్చి పవన్ పై తన భక్తిని మరోసారి చాటుకున్నాడు. అలా వకీల్ సాబ్ తో బండ్లగణేష్ ట్రెండింగ్ లోకి వచ్చారు.
ఇక మొన్న శుక్రవారం ఏప్రియల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన వకీల్ సాబ్ సూపర్ హిట్ టాక్ తో ప్రతి సినిమా హాల్ దగ్గర హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని చోట్లా పవన్ అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు.
దాంతో వకీల్ సాబ్ విడుదలయ్యాక ఈ సారి జస్ట్ వన్ వర్డ్తోనే పవర్ స్టార్ అభిమానులను హుషారెత్తిస్తూ పవన్ కళ్యాణ్‌పై మరోసారి తన అభిమానం చాటుకున్నారు. ''మాస్ కా బాప్.. మాటల్లేవ్.. ఇక వాదనలు అనవసరం. కేవలం జడ్జ్మెంట్ మాత్రమే. బ్లాక్ బస్టర్ వకీల్ సాబ్. జై పవర్ స్టార్'' అంటూ బండ్ల గణేష్ ట్వీట్ పెట్టారు. దీనిపై పవన్ ఫ్యాన్స్ పెద్దఎత్తున రియాక్ట్ అయ్యారు. బండ్ల గణేష్ కు థాంక్స్ చెప్పుకుని ఆ ట్వీట్ ని వైరల్ చేసే ప్రయత్నం చేసారు.
అయితే ఈ సినిమా బెనిఫిట్ షోలు, టిక్కెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మందికి షాక్ ఇచ్చింది. కొందరు నిర్ణయం కరెక్టే అంటూంటే..మరికొందరు వకీల్ సాబ్ కు కావాలని రాజకీయంగా ఇలా ఇరుకున పెడుతున్నారంటున్నారు. ఏది నిజం..ఏది కాదు అనేది ప్రక్కన పెడితే..ఈ టాపిక్ పై బండ్ల గణేష్ కూడా ట్విట్టర్ లో కామెంట్ చేసారు.
ఏపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ బండ్ల గణేష్ ట్వీట్లు చేసారు. ‘వకీల్ సాబ్ తో ఆపేస్తారా?’ అని ట్వీట్ చేసిన బండ్ల.. ‘ఏపీ ప్రభుత్వ తీరుపై సినీ పెద్దలు స్పందించరా?’ అని ప్రశ్నించాడు. అయితే చిత్రం ఏమిటంటే...ఎవరూ ఆయన ట్వీట్లకు స్పందించలేదు. సినీ పెద్దలు కూడా ఎవరూ మాట్లాడటం లేదు. దాంతో బండ్ల గణేష్ కూడా నెక్ట్స్ ఏమి మాట్లాడాలో తెలియని డైలమోలో పడిపోయారు.