తెలుగు ప్రేక్షకులకు బండ్ల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన బండ్ల గణేష్.. ఆ తరవాత స్టార్ హీరోలతో సినిమాలు తీసే రేంజ్ కి వచ్చి అందరికి షాక్ ఇచ్చాడు. పరమేశ్వరీ ఆర్ట్స్ బ్యానర్ పై పవన్ కళ్యాణ్, రవితేజ, ఎన్టీఆర్, అల్లు అర్జున్ మొదలైన స్టార్ హీరోలందరితో సినిమాలు నిర్మించాడు. 'గబ్బర్ సింగ్' హిట్ తో ఒక్కసారిగా ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూసర్ అయ్యాడని చెప్పవచ్చు. ఆ తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టి మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ మధ్య 'రాజకీయాలు వద్దు సినిమాలు ముద్దు' అంటూ ట్వీట్ చేసాడు. తన సినిమాలతోనే కాకుండా తన మాటల తోటి వ్యవహారశైలి తోటి వార్తల్లో ఉంటూ వస్తున్నాడు బండ్ల గణేష్. ఆలోచించకుండా మనసుకు ఏది తోస్తే అది ముక్కుసూటిగా మాట్లాడుతూ విమర్శలకు గురి అవుతుంటాడు. ఇంతకముందు కూడా ఒక ఇంటర్వ్యూలో నోరు జారీ తన పేరు అందరూ బ్లేడ్ గణేష్ అని పిలిచే స్టేజికి తెచ్చుకున్నాడు. అంతేకాకుండా సోషల్ మీడియా మాధ్యమాలలో యాక్టీవ్ గా ఉంటూ అన్ని విషయాలపై స్పందిస్తూ ఉంటాడు. ఆయన పెట్టే పోస్టులలో నిగూఢంగా ఏదొక పరమార్థం ఉండేలా ట్వీట్స్ చేస్తుంటాడు.
ఇప్పుడు తాజాగా బండ్ల చేసిన ట్వీట్స్ ఆలోచింప చేసేవిగా ఉన్నాయి. ''శత్రువికి మన విజయాలే కాదు.. మన పరాజయాలు కూడా తెలియాలి. అప్పుడే మనం వాటిని ఎదిరించి ఎలా నిలబడ్డామో కూడా తెలుస్తుంది..'' అంటూ ఒక ట్వీట్ చేసాడు. ''తింటున్నంత సేపు ‘ఇస్తరాకు’ అంటారు.. తిన్నాక ‘ఎంగిలి’ ఆకు అంటారు. అంటే నీతో అవసరం ఉన్నంతసేపు.. వరుసలు కలిపి మాట్లాడతారు.. అవసరం తీరాక లేని మాటలు అంటకడుతారు'' అనే కొటేషన్ బండ్ల గణేష్ మరో ట్వీట్ చేసాడు. ఇది ఎవరిని ఉద్దేశించి వేసారో అని నెటిజన్స్ ఆలోచిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఈ ట్వీట్ హరీష్ శంకర్ ని ఉద్దేశించే వేసాడు అని సోషల్ మీడియాలో చర్చింకుంటున్నారు. ఎందుకంటే ఇటీవల 'గబ్బర్‌సింగ్' 8 ఏళ్ళ ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ హరీష్ శంకర్ విడుదల చేసిన లేఖలో ఆ చిత్ర నిర్మాత అయిన బండ్ల గణేష్ పేరు మరిచిపోయాడు. కాకపోతే ఆ తర్వాత మరో ట్వీట్ లో మరిచిపోయానని చెబుతూ.. బ్లాక్ బస్టర్ నిర్మాత అంటూ బండ్ల కి కృతజ్ఞతలు తెలిపాడు. అంతటితో వివాదానికి ఫుల్ స్టాప్ పడిందని అందరూ అనుకున్నారు.
కానీ ఆ తర్వాత నుంచి హరీష్ శంకర్ పై బండ్ల గణేష్ తనదైన తరహాలో కామెంట్స్ చేశారని వార్తలు వచ్చాయి. కష్టకాలంలో ఉన్న హరీష్ కు నేనే అవకాశం ఇచ్చాను అని.. హరీష్ రీమేక్ సినిమాలను మాత్రమే హ్యాండిల్ చేయగలడు.. ఆయన స్ట్రైట్ తెలుగు సినిమా తీసి హిట్ కొడితే నేను ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతా అని చెప్పుకొచ్చాడట. అయితే వాటికి కూడా హరీష్ సమాధానం ఇచ్చారని ప్రముఖ ప్రసార మాధ్యమాలు వెల్లడించాయి. అసలు ‘గబ్బర్‌సింగ్’ సినిమాకి ముందు నిర్మాత నాగబాబు గారని.. కానీ నాకు అవకాశం పవన్ కల్యాణ్ అని తెలిపాడట. అయితే ఇప్పుడు తాజాగా బండ్ల గణేష్ ఎవరిని ఉద్దేశించి ఆ ట్వీట్స్ చేస్తున్నాడో చెప్పకుండా.. ఇన్ డైరెక్ట్‌గా ట్వీట్స్ చేస్తూ వస్తున్నారు. దీనిని బట్టి చూస్తే హరీష్ శంకర్ కి కౌంటర్ ఇలా ఇచ్చాడు అని నెటిజన్స్ డౌట్ వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు బండ్ల గణేష్ ''ఇద్దరమ్మాయిలతో హిట్'' అంటూ ట్వీట్ చేసి అల్లు అర్జున్ - పూరీ జగన్నాథ్ లతో ఉన్న ఫోటో ట్విట్టర్ లో షేర్ చేసాడు. దీనిని బట్టి చూస్తే బండ్ల ఇన్ డైరెక్ట్‌గా ఎవరినో టార్గెట్ చేస్తున్నారని అర్థం అవుతోంది.