నిర్మాతగా గబ్బర్ సింగ్ లాంటి హిట్టు కొట్టాలంటే మళ్లీ రీమేకే తీయాలనుకొన్నాడో ఏంటో తెలియదు కానీ... ఈమధ్య బండ్ల గణేష్ పొరుగు భాషల్లో హిట్టయిన సినిమాలపై పడ్డాడు. అయితే రీమేక్ హక్కుల్ని లేదంటే డబ్బింగ్ రైట్స్ ని కొంటూ వస్తున్నాడు. ఇటీవల మలయాళంలో విడుదలైన `టూ కంట్రీస్` రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్నాడు. ఆ చిత్రాన్ని ఎవరితో తీయాలా అని అన్వేషిస్తూ వచ్చాడు. తాజాగా ఆ అన్వేషణకి పుల్ స్టాప్ పడ్డట్టు తెలుస్తోంది. యంగ్ హీరో నానిని బండ్ల ఫైనల్ చేశాడని సమాచారం. నిజానికి ఆ కథని ఓ సీనియర్ హీరోతో కూడా తీయొచ్చు. అందుకే మొదట్లో బండ్ల గణేష్ ఆ సినిమా తీసుకెళ్లి రీమేక్ ల హీరో వెంకటేష్ కి చూపించాడట. బాగుంది అన్నాడట కానీ... చేస్తానా లేదా అన్న విషయాన్ని మాత్రం తేల్చలేదట.
అందుకే బండ్ల మరో హీరోని వెదుక్కున్నట్టు తెలిసింది. కథ బాగుంటే చేద్దామని చెప్పిన నాని ఇటీవలే ఆ సినిమాని చూసి ఓకే చెప్పినట్టు ప్రచారం సాగుతోంది. నాని ఇటీవల వరుస విజయాలతో జోరుమీదున్నాడు. తన రెమ్యునరేషన్ ని కూడా భారీగా పెంచాడు. అయినా సరే... బండ్ల గణేష్ అడిగినంత ఇవ్వడానికి సిద్ధమయ్యాడట. ప్రస్తుతం మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నటిస్తున్నాడు నాని. ఆ సినిమా పూర్తవ్వగానే టూ కంట్రీస్ రీమేక్ లో నటిస్తాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. మరి దర్శకుడు ఎవరన్నది మాత్రం ఇంకా తేలలేదు. బండ్ల ఈ చిత్రంతో పాటు కబాలిని కూడా తెలుగులో రిలీజ్ చేయాలనుకుంటున్నాడు. అలాగే లారెన్స్ సినిమాల్ని కూడా తెలుగులో రిలీజ్ చేయబోతున్నాడు.