టాలీవుడ్ లో మెగా ప్రొడ్యూసర్ గా ఫేమస్ అయ్యాడు బండ్ల గణేష్. గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ గణేష్ గా పాపులర్ అయ్యాడు. అయితే మెగాభిమానిగా అతడు పవన్ కల్యాణ్ తో సినిమా చేశాడు. హిట్ కొట్టాడు. ఆ సినిమా తీస్తున్నంత కాలం పవన్ నామ జపం చేశాడు. అలాగే ఆ తర్వాత చరణ్ హీరోగా గోవిందుడు అందరివాడేలే తెరకెక్కించాడు. చరణ్ తో వరుసగా సినిమాలు తీసేంత గొప్ప అభిమానం పెంచుకున్నాడు గణేష్.
అయితే పవన్, చరణ్ ఈ ఇద్దరికంటే ముందే చిరుకి పెద్ద వీరాభిమాని అతడు. వేషాల కోసం కృష్ణానగర్ వీధుల్లో తిరిగే రోజుల నుంచి గణేష్ మెగాస్టార్ అభిమానిగా కొనసాగాడు. ఓ రకంగా ఆ అభిమానం, మెగా కుటుంబంతో స్నేహమే అతడిని ఈ రోజు ఇంత పెద్ద ప్రొడ్యూసర్ ని చేసింది. అయితే ఇటీవలి కాలంలో మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో ఉన్నప్పుడు అంతగా చిరు గురించి ప్రస్థావించలేదు కానీ ఇప్పుడు రూటు మార్చి చిరుని స్మరిస్తున్నాడు బండ్ల బాబు. చిరు నామ స్మరణలోనే ఎక్కువ గడిపేస్తున్నాడు.
దీనికి కారణం ఏదైనా మెగాస్టార్ 150వ సినిమా సెట్స్ కెళ్లడానికి రెడీ అవుతున్న వేళ అని అనుకోవాలా? 'బాహుబలిని కొట్టే సినిమా తీస్తానని అన్నాడు. నా శత్రువుల ముందే విక్టరీ సాధిస్తా'నని ఛాలెంజ్ విసిరాడు. ఒకవేళ మెగాస్టార్ తో 151వ సినిమా అవకాశం తనకే వస్తుందని ఆశిస్తున్నాడని అనుకోవాలా? ఏమో! ఒకవేళ ఆ చిత్రానికి బాహుబలిని కొట్టేలా 300కోట్ల బడ్జెట్ రెడీ చేస్తున్నాడేమో! చేస్తే మంచిదే. ఒక అభిమానిగా మెగాస్టార్ కి ఇవ్వబోయే కానుక ఆ రేంజులోనే ఉండాలి.