మలయాళంలో బ్లాక్ బస్టర్ మూవీ అయిన బెంగళూర్ డేస్ ను బెంగళూరు నాట్కాల్ పేరుతో తమిళ్ లో రీమేక్ చేశారు. దగ్గుబాటి రాణా - సమంత - ఆర్య వంటి స్టార్లతో పాటు బాబీ సింహ - శ్రీదివ్యలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ తమిళ్ లో రూపుదిద్దుకుంది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో రూపొందిన ఈ మూవీకి.. తమిళనాడు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది.
ఈ శుక్రవారం విడుదలైన బెంగళూర్ నాట్కాల్ కి తమిళనాడు రాష్ట్రంలో ప్రదర్శితమయ్యే అన్ని షోలకు పన్ను రాయితీ ప్రకటిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మేకర్స్ కి అదనంగా పదిశాతం పైగా లాభం చేకూరనుంది. పీవీపీ సినిమాస్ బ్యానర్ పై బెంగళూరు నాట్కాల్ తెరకెక్కింది. ఈ చిత్రంలో హైద్రాబాదీ భామ శ్రీదివ్య దగ్గుబాటి రాణాకి హీరోయిన్ గా యాక్ట్ చేసింది. యూత్ ఫుల్ ఎంటర్టెయినర్ గా తెరకెక్కిన బెంగళూర్ నాట్కాల్ కు సెన్సార్ నుంచి క్లీన్ యూ సర్టిఫికేట్ లభించడం విశేషం. నిజానికి ఈ చిత్రాన్ని తమిళ్ తో పాటు తెలుగులోనూ తీయాలని భావించారు కానీ.. కాంబినేషన్స్ కుదరక సెట్ కాలేదు.
దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరాం డైరెక్షన్ లో తెలుగులోనూ ఈ చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నారు. అయితే ప్రస్తుతం బెంగళూరు నాట్కాల్ తమిళ్ వెర్షన్ లో నటించిన రాణా - సమంత - ఆర్య - శ్రీదివ్య - లక్ష్మీరాయ్ లకు టాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు ఉండడంతో.. డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తారని అనుకుంటున్నారు.