కార్తికేయ కథానాయకుడిగా బన్నీవాసు నిర్మాణంలో 'చావుకబురు చల్లగా' సినిమా నిర్మితమైంది. ఈ సినిమా ద్వారా కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సీనియర్ హీరోయిన్ 'ఆమని' ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించగా, ముఖ్యమైన పాత్రలో మురళీశర్మ కనిపించనున్నారు. ఈ నెల 19వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. కథానాయికగా లావణ్య త్రిపాఠి అలరించనుండగా, కార్తికేయ 'బస్తీ బాలరాజు' పాత్రలో కనిపించనున్నాడు.
'చావుకబురు చల్లగా' సినిమా అనేక కొత్త అంశాలకు తెరతీస్తూ వెళ్లడం ఆశ్చర్యాన్ని కలిగించకమానదు. టైటిల్ తోనే ఈ సినిమా కొత్తదనానికి శ్రీకారం చుట్టడం విశేషం. సాధారణంగా చాలామంది ప్రేక్షకులు హాస్పిటల్ సీన్స్ .. అంబులెన్స్ సీన్స్ చూడటానికి ఇష్టపడరు. అలాంటిది ఈ కథ శవాలను మోసుకెళ్లడం .. తీసుకెళ్లడం వంటి సన్నివేశాలను టచ్ చేస్తూ వెళుతుంది. ఎందుకంటే హీరో చేసే పనే శవాలను శ్మశానానికి తన వాహనంలో తరలించడం. ఈ తరహా పాత్రలు చేయడానికి హీరోలెవరూ సాహసించరు. కానీ కార్తికేయ అందుకు సిద్ధపడటం మరో విశేషం.
ఇక చనిపోయినవారి ఇళ్లలో బంధువుల ఏడుపులు .. మొత్తుకోళ్లు ఉంటాయి. అలాంటి చోటికి తన వాహనాన్ని తీసుకొచ్చి, ఆ గ్యాపులోనే అక్కడి అమ్మాయిలకు సైట్ కొట్టే వాడిగా బాలరాజును చూపించి ఒప్పించడం కూడా సామాన్యమైన విషయమేం కాదు. ఇక హీరోయిన్ అనగానే గ్లామర్ పరంగా కుర్రాళ్లు ఎన్నో ఊహించుకుంటారు. కానీ ఇందులో హీరోయిన్ 'విడో' పాత్రలో కనిపించనుంది. ఆమెను లైన్లో పెట్టడమే బాలరాజు ముందుకున్న ప్రధానమైన పని.
రొమాన్సును ఆశించలేని పాత్రలో హీరోయిన్ ను చూపించడం కూడా సాహసమే.
ఇక ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా అనసూయ స్పెషల్ సాంగ్ ఒకటి ఉంది. 'పైన పటారం .. లోన లొటారం' అంటూ ఈ పాట సాగుతుంది. అయితే ఇది ఐటమ్ అని కూడా అనలేం .. ఎందుకంటే మగాళ్లను రెచ్చగొడుతూ సాగే శృంగారభరితమైన పాట కాదు ఇది. లోకం పోకడ .. మనచుట్టూ ఉన్న మనుషుల తీరును చెప్పే పాట. ఐటమ్ లా అనిపిస్తూ .. కనిపిస్తూ .. మాటలతో చెప్పలేని జీవిత సత్యాలను పాటగా చెప్పించేశారు. ఇలా టైటిల్ .. హీరో వృత్తి .. లబోదిబోమనే చోట లైన్లు వేయడాలు .. హీరోయిన్ పాత్ర .. ఐటమ్ పాటలో లోకం తీరును చెప్పించడం .. ఇవన్నీ సాహసంతో కూడుకున్న పనులే. మరి వాటికి కామెడీని కనెక్ట్ చేస్తూ దర్శకుడు ఎలా ఒప్పిస్తాడో .. ఎంతలా మెప్పిస్తాడో చూడాలి.