ట్రైలర్ టాక్ : తీవ్రవాదంతో పోరాటం

Update: 2019-07-10 11:37 GMT
విభినమైన సినిమాలతో ఎప్పటికప్పుడు ప్రయోగాలు జరిగే బాలీవుడ్ లో మరో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వస్తోంది. అదే బాట్లా హౌస్. ఇవాళ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. సంజీవ్ కుమార్ యాదవ్(జాన్ అబ్రహం) ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. టెర్రరిస్టులు పొంచి ఉన్నారన్న సమాచారంతో ఓ విడిది మీద ఎటాక్ చేసిన అతని టీం చేతిలో అందులో ఉన్న యువకులంతా ప్రాణాలు కోల్పోతారు. కానీ వాళ్ళు తీవ్రవాదులు కాదని అమాయకులైన విద్యార్థులని కొత్త కోణం బయటపడటంతో ప్రభుత్వం ఇరకాటంలో పడుతుంది.

సంజీవ్ కుమార్ కు పై అధికారుల నుంచి ఒత్తిడితో పాటు విచారణ ఎదుర్కునే పరిస్థితి వస్తుంది. కానీ వాళ్ళు విద్యార్థి ముసుగులో ఉన్న దేశద్రోహులని నమ్ముతున్న సంజీవ్ కుమార్ సాక్ష్యాలు సేకరించే పనిలో పడతాడు. ఈలోగా అన్ని వైపులా అవమానాలు పోరాటాలు మొదలవుతాయి. దేశచరిత్రలోనే అత్యంత వివాదస్పద ఎన్ కౌంటర్ గా పేరు గాంచిన బాట్లా హౌస్ కేసు చిక్కుముడిని సంజీవ్ ఎలా పరిష్కరించుకున్నాడు అనేదే ఇందులో మెయిన్ పాయింట్

ట్రైలర్ చాలా ఇంప్రెసివ్ గా కట్ చేశారు. కథ మొత్తం అరటిపండు వొలిచినట్టు చెప్పినప్పటికీ సినిమా చూసే తీరాలన్న ఆసక్తి రేపడంలో టీం సక్సెస్ అయ్యింది. జాన్ అబ్రహం స్క్రీన్ ప్రెజెన్స్ చాలా సహజంగా ఉండటంతో పాటు నటన పరంగా తనలోని బెస్ట్ మరోసారి ఇచ్చాడు. జాన్ స్టీవార్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వెన్నెముకగా నిలవగా సౌమిక్ ముఖర్జీ ఛాయాగ్రహణం అత్యున్నతస్థాయిలో ఉంది. నిఖిల్ అద్వానీ దర్శకత్వం ఆద్యంతం ఉత్కంఠ రేపేలా ఉంది. టి సిరీస్ ప్రొడక్షన్ ఎప్పటిలాగే రిచ్ గా ఉండగా స్వతంత్ర దినోత్సవం నాడు బాలీవుడ్ మూవీ లవర్స్ కు ఫస్ట్ ఛాయిస్ గా నిలిచే అంశాలన్నీ పొందుపరుచుకున్న బాట్లా హౌస్ ఒక్కసారిగా అంచనాలు పెంచేసిన మాట వాస్తవం

Full View
Tags:    

Similar News