బిబి4 : మరోసారి ఎమోషనల్‌ డ్రామా

Update: 2020-11-13 02:48 GMT
బిగ్‌ బాస్‌ లో ఎప్పుడు హోరా హోరీ టాస్క్‌ లు మరియు ఫన్‌ మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఎమోషనల్‌ సందర్బాలు కూడా ఉంటుంది. ఆ విషయంలో ఈసారి బిగ్‌ బాస్‌ ఎక్కువ దృష్టి పెట్టినట్లుగా అనిపిస్తుంది. ప్రేక్షకులను టీవీల ముందు కూర్చోబెట్టాలి అంటే ఎమోషనల్‌ గా కట్టి పడేయాలని భావిస్తున్నట్లుగా ఉన్నాడు. అందుకే మరోసారి ఓ ఎమోషనల్‌ ఎపిసోడ్‌ ను టెలికాస్ట్‌ చేయడం జరిగింది. బిగ్‌ బాస్‌ దీపావళి సందర్బంగా ఇంటి నుండి కుటుంబ సభ్యులు రాసిన ఉత్తరాలను కంటెస్టెంట్స్‌ కు బహుమానంగా ఇచ్చేందుకు ఒక టాస్క్‌ పెట్టాడు. ఆ టాస్క్‌ లో భాగంగా జీవితంలో అతి పెద్ద రహస్యం ఇప్పటి వరకు ఎవరితో షేర్‌ చేసుకోనటువంటి రహస్యంను చెప్పాలంటూ బిగ్‌ బాస్‌ కండీషన్‌ పెట్టాడు.

సీక్రెట్‌ రూంలో ఉన్న అఖిల్‌ వారు చెప్పిన సీక్రెట్లు నిజమేనా జెన్యూన్‌ గా అనిపించాయా లేదా అనేది గమనించి వారికి లెటర్‌ పంపించాల్సి ఉంటుంది. సీక్రెట్‌ కాకుండా మరేదో చెప్పారు అనిపిస్తే అఖిల్‌ వారి లెటర్స్‌ ను చించేయాల్సి ఉంటుంది. ఈ టాస్కలో భాగంగా అవినాష్‌ మరియు అరియానాలు తప్ప అంతా కూడా లెటర్స్‌ అందుకున్నారు. వారిద్దరు చెప్పిన సీక్రెట్స్‌ విషయంలో అఖిల్‌ సంతృప్తి చెందలేదు. అవినాష్‌ సీక్రెట్‌ అంటూ అందరికి తెలిసిన విషయమే చెప్పాడు. అలాగే అరియానా సీక్రెట్‌ కాకుండా తన జీవితంలో జరిగిన యాక్సిడెంట్‌ గురించి చెప్పింది అందుకే ఇద్దరికి కూడా లెటర్స్‌ పంపించకుండా చించినవి పంపించాడు.

వారిద్దరు చిరిగిన లెటర్స్‌ రావడంతో ఆ ముక్కలను సర్దుకుని చదుకునే ప్రయత్నం చేయడం ప్రేక్షకులకు అయ్యో అనిపించింది. వీరిద్దరు కాకుండా ఇతరులు చెప్పిన సీక్రెట్లు అఖిల్‌ కు నిజం అనిపించడంతో పాటు కనెక్ట్‌ అయ్యాడు. ఇతరులు చెప్పిన రహస్యాలు ఏంటీ అంటే.. మెహబూబ్‌ ఒక చిన్న గొడవ కారణంగా రెండు రోజులు స్టేషన్‌ లో ఉన్నాడు. అమెరికాలో అభిజిత్‌ కొత్తలో పొరపాటున గే రెస్టారెంట్‌ కు వెళ్లాడట.. ఇక హారిక నాలుగున్నర ఏళ్ల పాటు రిలేషన్‌ లో ఉన్న విషయం ఎవరికి చెప్పకుండా రెండు సంవత్సరాల క్రితం బ్రేకప్‌ అయ్యిందట.

సోహెల్‌ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ లో పట్టుబడి కౌన్సిలింగ్‌ కు వెళ్లాడట ఇక లాస్య తన భర్త మంజునాద్‌ తనకంటే ఒక ఏడాది చిన్న అనే విషయం చెప్పింది. మోనాల్‌ తన డిగ్రీ సమయంలో సబ్జెక్ట్‌ లు పోయిన విషయాన్ని చెప్పింది. ఇంటి నుండి వచ్చిన లెటర్లను చదువుకుంటూ అంతా ఆనందంతో కన్నీరు మున్నీరు అయ్యారు. అఖిల్‌ కూడా తన లెటర్‌ పంపించాలంటూ విజ్ఞప్తి చేశాడు. మొత్తానికి తాజా ఎపిసోడ్‌ లో ఎమోషనల్‌ డ్రామా కొనసాగింది.
Tags:    

Similar News