కరోనా పరిస్థితుల కారణంగా కాస్త ఆలస్యంగా ప్రారంభం అయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 రేటింగ్ విషయంలో మొదటి రెండు వారాలు పర్వాలేదు అనిపించినా రాను రాను రేటింగ్ దారుణంగా పడిపోయింది. వీకెండ్స్ కాస్త పర్వాలేదు అనిపించినా కూడా వీక్ డేస్ రేటింగ్ మరీ వీక్ గా ఉన్నాయి. దాంతో టాస్క్ లు రచ్చ రచ్చ అన్నట్లుగా ఇచ్చినా కూడా బిగ్ బాస్ కు ప్రేక్షకులు ఆధరణ చూపడం లేదు. దాంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి చాలా రోజులుగా బిగ్ బాస్ నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. షో ఇన్ని వారాలు పూర్తి అయిన తర్వాత ఎవరో సాదారణ వ్యక్తిని వైల్డ్ కార్డ్ గా పంపిస్తే ఖచ్చితంగా ప్రేక్షకులు మరియు ఇంటి సభ్యులు తిరష్కరిస్తారు. అందుకే ఒక స్టార్ సెలబ్రెటీని పంపించాలనుకున్నారు.
తెలుగులో యాంకర్ అనగానే గుర్తుకు వచ్చే పేరు సుమ. అంతటి క్రేజ్ ను దక్కించుకున్న సుమను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోనికి పంపించబోతున్నట్లుగా నేటి ప్రోమోను చూస్తే అనిపిస్తుంది. కాని ఇలాంటి ప్రోమో మ్యాజిక్ లు చాలా చూసిన ప్రేక్షులు ఎక్కువ శాతం మంది సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే నమ్మడం లేదు. కొందరు మాత్రం ఈ సమయంలో సుమను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోనికి పంపించాలని భావించడం నిజమే అయ్యి ఉంటుంది.
సాదారణంగా అయితే సుమ ఉండే బిజీకి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం అనేది సాధ్యం కాదు. కాని ఆమె కరోనా కారణంగా చాలా తక్కువ కార్యక్రమాలు చేస్తుంది. దానికి తోడు బిగ్ బాస్ షో మరో అయిదు వారాలు మాత్రమే ఉంది. కనుక ఆమె లోనికి వెళ్లేందుకు ఒప్పుకుని ఉంటుందని భారీ పారితోషికం ఆఫర్ చేస్తే ఈ సమయంలో ఎందుకు కాదంటారు అంటూ కొందరు అంచనా వేస్తున్నారు. మొత్తానికి తెలుగు బిగ్ బాస్ హౌస్ లోకి సుమ వెళ్లిందా లేదంటే ప్రతి రోజు ఎడిటర్ ప్రేక్షకులను మోసం చేస్తున్నట్లుగానే ఈసారి నాగార్జున ప్రేక్షకులను మోసం చేశాడా అనేది షో నేడు రాత్రి ప్రసారం అయితే కాని క్లారిటీ రాదు. ఒక వేళ సుమ నిజంగా వైల్డ్ ఎంట్రీ ఇస్తే నాగార్జున అన్నట్లుగా ఈ అయిదు వారాలు ఎంటర్ టైన్ మెంట్ మామూలుగా ఉండదు.