బిగ్ బాస్ నుండి నోయల్ ఔట్ అయ్యాడు. అనారోగ్య కారణాలతో చికిత్స కోసం అంటూ బయటకు వెళ్లిన నోయల్ మళ్లీ హౌస్ లోకి వస్తాడని కంటెస్టెంట్స్ తో పాటు ప్రేక్షకులు కూడా భావించారు. కాని ఆయన ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఆయన మళ్లీ హౌస్ లోకి వెళ్లడం లేదంటూ తేలిపోయంది. బిగ్ బాస్ సీజన్ 4 నుండి మరో ఎలిమినేషన్ నోయల్ విభిన్న పరిస్థితుల నేపథ్యంలో జరిగింది. గంగవ్వను ఇప్పటికే అనారోగ్య పరిస్థితుల కారణంగా బయటకు పంపించిన నిర్వాహకులు ఇప్పుడు నోయల్ ను కూడా అదే కారణంతో ఎలిమినేట్ చేశారు. నోయల్ ఎలిమినేషన్ ను ఒక ప్రాపర్ పద్దతిలో చేయాలనే ఉద్దేశ్యంతో నిన్నటి ఎపిసోడ్ లో స్టేజ్ పైకి తీసుకు వచ్చారు.
నోయల్ స్టేజ్ పై నుండి నాగార్జున పక్కన ఉండి చాలా మాట్లాడాడు. తన మనసులోని బాధను.. తాను పడ్డ శారీరక మానసిక బాధను చెప్పాడు. తనకు నొప్పులు శారీరకంగా బాధను కలిగిస్తే అవినాష్ మరియు అమ్మ రాజశేఖర్ లు మానసికంగా బాధపెట్టారు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తన నొప్పిని వారిద్దరు కామెడీ చేశారంటూ నోయల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నేను నొప్పితో ఎలా నడుస్తున్నానో అవినాష్ ఇమిటేట్ చేయడం అమ్మ రాజశేఖర్ కామెంట్ చేయడం ఎంతో బాధ అనిపించింది అంటూ నాగార్జున ముందే వారిని ఒంటి కాలుపై నిలబెట్టి మరీ కడిగేశాడు.
ఇన్ని రోజులు ఇంట్లో ఉన్న సమయంలో ఏ ఒక్కరిపై కూడా సీరియస్ అవ్వని నోయల్ బయటకు వెళ్లిన తర్వాత మాస్క్ పూర్తిగా తొలగించుకుని మాట్లాడాడు అనిపించింది. తాను కామెడీ చేసిన సమయంలో నవ్విన నోయల్ ఇప్పుడు బయటకు వెళ్లిన తర్వాత అలా చేయడం తప్పు అనడం ఎంత వరకు కరెక్ట్ అంటూ అవినాష్ చాలా సీరియస్ అయ్యాడు. అలా చేసినప్పుడే నువ్వు తప్పు చేస్తున్నావ్ నాకు అలా చేస్తే బాధగా ఉంది అంటూ చెప్తే సరిపోయేది. కాని నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు సేఫ్ గేమ్ ఆడి ఇప్పుడు బటయకు వెళ్లిన తర్వాత మమ్ములను బ్యాడ్ చేసేందుకు మాట్లాడటం ఏమాత్రం కరెక్ట్ కాదని అవినాష్ అన్నాడు. మిమిక్రీ చేయడం, ఇమిటేట్ చేయడం నవ్వించడమే తప్పు అయితే క్షమించు అంటూ అవినాష్ మోకరిళ్లాడు.
ఈ మొత్తం ఎపిసోడ్ లో నోయల్ ను విమర్శించే వారు ఉన్నారు ఆయన మద్దతు తెలిపే వారు ఉన్నారు. ఆయన బాధ పడినట్లయితే హౌస్ లోనే ఆ సమయంలోనే అడిగేస్తే బాగుండేది. ఇన్ని రోజులు సేఫ్ గేమ్ ఆడినట్లుగా నోయల్ పై మచ్చ ఉంది. అది దీంతో మరింత నిజం అని తేలింది అంటూ కొందరు నెటిజన్స్ అంటున్నారు. మరి కొందరు మాత్రం ఫిజికల్ గా బాధపడుతున్న వారిపై జోకులు వేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఆ సమయంలో స్పందించలేక పోవచ్చు. వెంటనే స్పందించడం ఇష్టం లేక నోయల్ ఇప్పుడు స్పందించి ఉండవచ్చు అంటూ కొందరు నోయల్ కు మద్దతు తెలుపుతున్నారు.