ఎంటర్ టైన్ మెంట్ రంగంలో ఉన్న వారు అదృష్టవంతులు.. వారు హాయిగా పని చేసుకుంటూ లక్షలు.. కోట్లు సంపాదిస్తున్నారు అనే అభిప్రాయం కొందరిలో ఉంటుంది. ముఖ్యంగా హీరోలు ఊరికే కోట్ల రూపాయల పారితోషికాలు తీసుకుంటున్నారనే అభిప్రాయంతో కొందరు కలిగి ఉన్నారు. కాని వారు ఆ స్థాయికి రావడానికి పడ్డ కష్టం.. హీరోగా నటించేందుకు వారు పడే కష్టం అంతా ఇంతా కాదు.
ఒల్లు హూనం అయ్యేంతగా కష్టపడుతూ ఉంటారు. కేవలం హీరోలు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడుతారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు లక్షల పారితోషికం ఉంటుందనే టాక్ ఉంది. వారు ఊరికే తిని కూర్చునేందుకు అంత పారితోషికమా అనుకునే వారు చాలా మంది ఉంటారు. కాని వారు పడే కష్టం వారికి మాత్రమే తెలుసు.
బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఫిజికల్ టాస్క్ లతో పాటు మెంటల్ గా కూడా వారు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. తాజాగా బిగ్ బాస్ సీజన్ 5 లో శ్రీరామ చంద్ర ను చూస్తే ఆ విషయం అర్థం అవుతుంది. బిగ్ బాస్ టాస్క్ లో భాగంగా ఐస్ లో చాలా సమయం కంటెస్టెంట్స్ కాళ్లు పెట్టి ఉంచారు. అందులో కొందరి కాళ్లు చాలా డ్యామేజీ అయ్యాయి.
శ్రీరామ చంద్ర కాళ్లు మరీ దారుణంగా అయ్యాయి. టాస్క్ పూర్తి అయ్యి వారాలు గడుస్తున్నా ఇంకా కూడా ఆయన కాళ్లు పూర్తి స్థాయిలో నార్మల్ అవ్వలేదు. కాళ్లు పాచి పోయినట్లుగా మారాయి. అతడు ఇంకా కూడా నడవలేని పరిస్థితిలోనే ఉన్నాడు. అయినా కూడా ఆయన దాన్ని గురించి ఆలోచించకుండా బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లో కష్టపడుతూనే ఉన్నాడు.
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోలు ఆయన కాళ్ల పరిస్థితిని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తున్నాయి. మరీ దారుణంగా ఆయన కాళ్లు చెడి పోయాయి. సాదారణ స్థితికి వచ్చేందుకు నెలల సమయం పట్టేలా ఉంది. దారుణమైన ఆయన పరిస్థితికి ప్రేక్షకులు ముఖ్యంగా ఆయన అభిమానులు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బిగ్ బాస్ ఇలాంటి టాస్క్ లు ముందు ముందు ఇవ్వ కూడదు అంటూ అభిమానులు కోరుకుంటున్నారు. ఈ వారంతో బిగ్ బాస్ సీజన్ 5 ముగుస్తోంది. వచ్చే ఆది వారం సాయంత్రం ఫినాలే ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వబోతుంది. శ్రీరామ చంద్ర మాత్రమే కాకుండా ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా ఈ సీజన్ లో కష్టపడ్డారు. కష్టపడ్డవారు ఇలా ఫినాలే కు చేరుకున్నారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.