2012లో వచ్చిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ 'అందాల రక్షసి' మూవీతో సినీ కెరీర్ ను ప్రారంభించిన యూపీ బ్యూటీ లావణ్య త్రిపాఠి.. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుని యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఈ సినిమాను చూసిన వారు లావణ్య త్రిపాఠి ఖచ్చితంగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్ట్ లో ఒకరిగా గుర్తింపు సంపాదించుకుంటుందని భావించారు.
కానీ, అందరి అంచనాలను ఆమె తలకిందులు చేసింది. 'అందాల రక్షసి' తర్వాత లావణ్య త్రిపాఠి వరుస పెట్టి సినిమాలు చేసింది. అయితే వాటిలో 'భలే భలే మగాడివోయ్', 'సోగ్గాడే చిన్నినాయనా', 'అర్జున్ సురవరం' వంటి చిత్రాలు మినహా.. మిగిలినవన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఈ అమ్మడు తమిళం, హిందీ భాషల్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకున్నా.. ఫలితం లేకుండా పోయింది.
రీసెంట్ గా లావణ్య త్రిపాఠి 'హ్యాపీ బర్త్‌డే' మూవీతో పలకరించింది. కానీ, ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలం అయింది. ఈ నేపథ్యంలోనే లావణ్య రూటు మార్చింది. కెరీర్ ఆరంభం నుంచీ లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ లోనే నటిస్తూ వచ్చిన లావణ్య త్రిపాఠి.. ఇక ముందు మాత్రం ప్రయోగాలకే ప్రాధాన్యతనిస్తానని అంటోంది.
లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ తనకు బోర్ కొట్టాయని, ప్రేక్షకులు కూడా బోరింగ్‌గా ఫీలవుతున్నారని లావణ్య పేర్కొంది. అందుకే ఇకపై పక్కింటి అమ్మాయి తరహా పాత్రలను వదిలేసి.. యాక్షన్ రోల్స్ ను ఎంచుకుంటున్నానని తెలిపింది. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి ఓ యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తోంది. పోలీస్ కథాంశంతో ఈ మూవీని రూపొందిస్తున్నారు.
ఈ సినిమా కోసం లావణ్య త్రిపాఠి దాదాపు రెండు నెలల పాటు కఠినమైన శిక్షణ తీసుకుందట. కిక్ బాక్సింగ్ కూడా నేర్చుకుందట. యాక్షన్ సీన్స్‌లో నటించడం కొత్త అనుభూతినిచ్చిందని, ప్రేమకథా చిత్రాల్లో తనను రక్షించడానికి హీరో ముందుకొచ్చేవాడు. కానీ, ఇప్పుడు తానే స్వీయరక్షణ చేసుకోవడం థ్రిల్‌గా ఫీలయ్యానంటూ లావణ్య పేర్కొంది. అయితే ఈ సినిమా పూర్తి వివరాలను మాత్రం ఆమె బయట పెట్టలేదు. మొత్తానికి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న లావణ్య త్రిపాఠికి.. యాక్షన్ రోల్స్ వర్కౌట్ అవుతాయా? ఆమెను మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాయా..? అన్నది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.