బిఫోర్ అండ్ ఆఫ్ట‌ర్ జాన్వీ అల‌వాట్లు త‌ల‌కిందులు

Update: 2021-02-02 00:30 GMT
గ‌త కొంత‌కాలంగా జాన్వీ డిస్ట్ర‌బ్డ్ మూడ్ తో ఉంది. కార‌ణం ఏమిటి? అంటే.. ఈ అమ్మ‌డు ఎక్క‌డ షూటింగ్ కి వెళ్లినా అక్క‌డ రైతుల నిర‌స‌న‌ల‌తో భ‌గ్గుమంటోంది. ఇంత‌కుముందు ఛండీఘ‌ర్ లో ఓసారి షూటింగుని నిలిపివేశారు. పాటియాలా జిల్లాలో రైతులు పెద్ద ఎత్తున కేంద్రంపై నిర‌స‌న‌లు తెల‌ప‌డ‌మేగాక జాన్వీని మ‌ద్ధ‌తు కోరుతూ షూటింగు స్పాట్ లో నిర‌స‌న‌లు తెలిపారు. పంజాబ్ లో దిల్లీ బార్డ‌ర్ లో ఎక్క‌డ లొకేష‌న్ కి వెళ్లినా ఇదే ప‌రిస్థితి ఉంది.

ఆ క్ర‌మంలోనే జాన్వీ చాలా డిస్ట్ర‌బ్ అయ్యింది. ఇదే మూడ్ లో త‌న అల్పాహార సెష‌న్స్ లోనూ మార్పు క‌నిపిస్తోంది. చూసారుగా బిఫోర్ అండ్ ఆఫ‌ర్ట్ ఫుడింగ్ ఇలా ఉంది! అంటూ త‌ల‌కిందులుగా ఉన్న ఈమోజీని జాన్వీ షేర్ చేసింది. షూట్ గ్యాప్ లో చాలా సింపుల్ గా తేలిక‌గా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవ‌డం జాన్వీకి అల‌వాటు. చాలా వేగంగా త‌యారు చేసుకునే ఓట్స్ మీల్ ని సేవిస్తోంది.

అందుకు సంబంధించిన ఫోటోని జాన్వీ స్వ‌యంగా ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసింది. ఓవైపు అసిస్టెంట్ త‌న త‌ల‌నీలాల్ని స‌వ‌రిస్తూ మేక‌ప్ వేస్తుంటే ఇదిగో ఇలా అల్పాహారం కానిచ్చేస్తోంది. కరోనా క‌ల్లోలం వ‌ల్ల బిఫోర్ అండ్ ఆఫ్ట‌ర్ సినీఇండ‌స్ట్రీలో చాలా మారుతున్నాయి. అలాగే తార‌ల హ్యాబిట్స్ కూడా మారాల్సిన త‌రుణ‌మిదేన‌ని అర్థ‌మ‌వుతోంది.

సంద‌ర్భాన్ని బ‌ట్టే ఏదైనా! ఇక అల‌జ‌డుల వేళ కూడా ఏదో ఒక మార్పుతో ప్రీప్రిప‌రేష‌న్ త‌ప్ప‌నిస‌రి అని జాన్వీ చెబుతున్న‌ట్టే ఉంది. ఈ ఫోటోలో జాన్వీ స్ట‌న్నింగ్ మేకోవ‌ర్.. రెడ్ హాట్ డ్రెస్ ఎంతో ఆక‌ట్టుకుంటోంది. అలా కాలిపై కాలు వేసుకుని థై సొగ‌సుల ఎలివేష‌న్ యూత్ ని మురిపిస్తోంది. జ‌గ్ జ‌గ్ జియో షూటింగ్ కి ప్ర‌స్తుతానికి బ్రేక్ ప‌డింది. త‌దుప‌రి దోస్తానా 2.. త‌క్త్  స‌హా ప‌లు చిత్రాల్లో న‌టించాల్సి ఉంటుంది.
Tags:    

Similar News