వారసులు సినిమాల్లోకి రావటం మామూలే. అయితే.. ఎలాంటి ఇమేజ్ లేకుండా తెర మీదకు రావటమే ఒక ఎత్తు అయితే.. అందరి దృష్టిలో పడటం మాత్రం కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి కష్టమైన.. క్లిస్టమైన ఫీట్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశాడు ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్.
అల్లుడు శ్రీనుగా అందరి మదిలో రిజిష్టర్ అయిన ఈ యువ హీరో ఏడాది బ్రేక్ తీసుకొని మరీ తాజా సినిమాకు ఓకే చెప్పేశాడు.
వైవిధ్యమైన కథతో.. భారీ ఎత్తున సాంకేతిక నిపుణులతో తీర్చిదిద్దనున్న ఈ మూవీ కాస్ట్ అండ్ క్రూ చూస్తేనే సినిమా ఎంత పెద్ద ఎత్తున తీయనున్నారో తెలుస్తుంది. దర్శకుడు శ్రీవాస్ ఇప్పటివరకూ తీసిన తన సినిమాలకు భిన్నమైన కాన్సెప్ట్ ను తీసుకొని తాజా చిత్రాన్ని రూపొందించనున్నట్లు చెప్పారు. ఈ సినిమాకు దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా.. యాక్షన్ పార్ట్‌ను పీటర్ హేన్స్ చూసుకోనున్నారు. తన డైలాగులతో ప్రేక్షకుల మదిలో ముద్ర వేసే సాయి మాధవ్ బుర్రా మాటల్ని అందించనున్నారు.
తాజాగా రామానాయుడు స్టూడియోస్ లో జరిగి సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో వివి వినాయక్.. బోయపాటి శ్రీను.. లారెన్స్.. ఎంఎస్ రాజు.. రాజా రవీంద్ర.. బెల్లంకొండ సురేశ్ తదితరులు పాల్గొన్నారు. జగపతిబాబు కీ రోల్ ప్లే చేయనున్న ఈ సినిమాకు వివి వినాయక్ క్లాప్ ఇవ్వగా.. బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. భారీగా సాగిన ప్రారంభోత్సవ కార్యక్రమం.. చిత్రాన్ని ఎంత ప్రిస్టేజ్ గా తీసుకొని తీస్తున్నారో అర్థమయ్యేలా ఉందన్న మాట వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/