ప్రస్తుతం రోజుల్లో స్టార్ హీరో హోదాను అందుకోవాలంటే కష్టంతో పాటు చాలా అదృష్టం ఉండాలి. అయితే నిర్మాతల కుమారులకు మాత్రం అదృష్టం అక్కర్లేదు. కేవలం కష్టపడితే చాలు స్టార్ హోదాని ఈజీగా అందుకుంటారు. అదే తరహాలో తన టాలెంట్ ని చూపించుకుంటున్నాడు బెల్లకొండ వారసుడు శ్రీనివాస్. మొదటి సినిమాతోనే వివి వినాయక్ వంటి దర్శకులతో పని చేశాడు.
ఆ తర్వాత స్పీడున్నోడుగా గా పలకరించాడు గాని అంతగా సక్సెస్ కాలేదు. ఇక రీసెంట్ గా ఊర మాస్ దర్శకుడైన బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో జయ జానకి నాయక సినిమా తీశాడు. అదికూడా నిరాశపరిచింది. దీంతో ఈ సారి శ్రీవాస్ తో కలిసి మరో సారి తన టాలెంట్ నిరూపించుకోవడానికి సిద్దమయ్యాడు. గత ఏడాది బాలయ్యతో డిక్టేటర్ తీసిన శ్రీవాస్ ఇప్పుడు బెల్లకొండ శ్రీనివాస్ ని తనదైన శైలిలో చూపించడానికి రెడీ అయ్యాడు. ఇంజనీరింగ్ విద్యార్థి చుట్టూ తిరిగే ఈ కథలో కాస్త టెక్నాలజీని వాడుతున్నారట. అంతే కాకుండా కొన్ని భారీ యాక్షన్ సీన్స్ ని తీస్తున్నారు.
రీసెంట్ గా హైదరాబద్ - పోలాచ్చిల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం వారణాసి సైడ్ వెళుతోందట. అక్కడ పీటర్ హెయిన్స్ తో కొన్ని పోరాట సన్నివేశాలను చిత్రీకరించడానికి పూర్తి సన్నాహకాలు రెడీ చేసుకున్నాడు దర్శకుడు శ్రీవాస్. మంచి ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని అభిషేక్ నామా నిర్మిస్తున్నాడు.