చిన్న.. పెద్ద అని తేడా ఉండదు. హీరోల్ని పొగడ్డమే ఇండస్ట్రీ జనాల పని. ఏదైనా సినిమా వేడుక జరిగితే.. అక్కడ అందరూ హీరోను పొగడ్డమే పనిగా పెట్టుకుంటారు. అంతగా ఇమేజ్ లేని హీరోల్ని కూడా ఆకాశానికి ఎత్తేస్తుంటారు. ఇప్పటిదాకా నాలుగు సినిమాలు చేసినా ఒక్క హిట్టూ కొట్టని బెల్లంకొండ శ్రీనివాస్ ను కూడా ‘కవచం’ చిత్ర బృందం ఇలాగే పొగిడేస్తోంది. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని డిసెంబరు 7న విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఐతే మధ్యలో ఈ చిత్రం ఆ తేదీకి రెడీ కాకపోవచ్చని వార్తలొచ్చాయి. కానీ శ్రీనివాస్ అస్సలు రాజీ పడకుండా శరవేగంగా షూటింగ్ కానిచ్చి.. డబ్బింగ్ వర్క్ కూడా పూర్తి చేసి సినిమాను డిసెంబరు 7కే ప్రేక్షకుల ముందుకు తేవడానికి కారణమయ్యాడట.
ఇటీవలే దుబాయ్ లో కాజల్ తో కలిసి ఓ పాట చిత్రీకరణలో పాల్గొన్న శ్రీనివాస్.. అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్న వెంటనే డబ్బింగ్ మొదలుపెట్టాడట. కేవలం పది గంటల్లో మొత్తం సినిమాకు డబ్బింగ్ పూర్తి చేసేశాడట. దీని గురించి చిత్ర బృందం గొప్పలు పోతోంది. అతడి కమిట్మెంట్ సూపర్ అంటోంది. కానీ ఎంత వేగంగా పని పూర్తి చేశారన్నదానికంటే ఎంత క్వాలిటీ ఉందన్నది ముఖ్యం. బెల్లంకొండ శ్రీనివాస్ విషయానికి వస్తే.. అతడికి ఉన్న పెద్ద మైనస్ పాయింట్లలో డబ్బింగ్ ఒకటి. లుక్స్ పరంగా ఓకే అయినప్పటికీ.. వాయిస్ బాగోదు. డైలాగ్ డెలివరీ విషయంలో చాలా మెరుగు పడాల్సి ఉంది. ముఖ్యంగా మాస్ సినిమాల్లో భారీ డైలాగులు చెబుతుంటే అంత ఎఫెక్టివ్ గా అనిపించదు. అతడి సినిమా రిలీజైన ప్రతిసారీ డబ్బింగ్ విషయంలో కంప్లైంట్లు వస్తుంటాయి. ఎందుకోగానీ ఈ విషయంలో అతను మెరుగుపడలేకపోతున్నాడు. ప్రత్యేక శ్రద్ధ పెట్టలేకపోతున్నాడు. మరి ‘కవచం’ డబ్బింగ్ వర్క్ పదే పది గంటల్లో పూర్తి చేశాడంటే ఇందులో అతడి వాయిస్ ఎలా ఉంటుందో.. డబ్బింగ్ ఏమాత్రం కుదురుతుందో అన్న సందేహాలు కలుగుతున్నాయి.