బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరిచయమైన ‘అల్లుడు శీను’ సినిమాపై పెట్టిన పెట్టుబడి.. రాబడి చూసుకుంటే అది పెద్ద ఫ్లాప్ కిందే లెక్క. కానీ అతడి స్థాయికి తొలి సినిమాతో రూ.20 కోట్ల దారా రాబట్టడం అంటే గొప్ప విషయమే. కొడుకు మీద ప్రేమతో బెల్లంకొండ సురేష్ బాగా ఎక్కువ ఖర్చు చేయడం వల్ల నష్టం వాటిల్లింది కానీ.. మామూలుగా చూస్తే మాత్రం ‘అల్లుడు శీను’ బాక్సాఫీస్ దగ్గర బాగానే పెర్ఫామ్ చేసినట్లు లెక్క. ఈ సినిమాతో శ్రీనివాస్ కు మంచి పేరే వచ్చింది. అతడి గురించి తెలుగు ప్రేక్షకుల్లో బాగానే చర్చ జరిగింది. ఐతే శ్రీనివాస్ రెండో సినిమా ‘స్పీడున్నోడు’ మాత్రం అతడికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ సినిమా వచ్చింది తెలియదు.. వెళ్లింది తెలియదు.
‘స్పీడున్నోడు’ ఫలితం చూసి శ్రీనివాస్ కూడా చాలానే ఫీలయ్యాడట. ఎంతలా అంటే.. బోరున ఏడ్చేసేంతలా. ‘‘నేను సాధారణంగా ఏడవను. స్ట్రాంగ్ గా ఉంటాను. కానీ ‘స్పీడున్నోడు’ ఫెయిల్యూర్’ నన్ను బాగా కుంగదీసింది. దాంతో బాగా ఏడ్చేశాను. ఆ సమయంలో నా కుటుంబ సభ్యులు.. స్నేహితులు నాకు అండగా నిలిచారు’’ అని శ్రీనివాస్ తెలిపాడు. ‘స్పీడున్నోడు’ సరిగా ఆడకపోయినప్పటికీ బోయపాటి శ్రీనివాస్ దాని గురించి పట్టించుకోకుండా తనతో సినిమా చేయడం గొప్ప విషయమని అన్నాడు శ్రీనివాస్. బోయపాటి తనను సొంత అన్న లాగా చూసుకున్నాడని.. నీ వెనుక నేనున్నా అంటూ సపోర్ట్ చేశాడని.. తనతో ఇంకో సినిమా కూడా చేస్తానని మాటిచ్చాడని శ్రీనివాస్ తెలిపాడు. తనలో బోయపాటికి అంతలా ఏం నచ్చిందో అర్థం కాలేదని శ్రీనివాస్ వ్యాఖ్యానించడం విశేషం.