బోయపాటి-బెల్లంకొండ.. గట్టి ముహూర్తమేనా!

Update: 2016-11-04 11:47 GMT
ఈ ఏడాది సరైనోడుతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన డైరెక్టర్ బోయపాటి శ్రీను. సరైనోడు సెట్స్ పై ఉండగానే బోయపాటి కొత్త సినిమా కూడా ఖాయమైంది. అప్పట్లోనే బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేయనున్నట్లు చెప్పేశాడు. కానీ సరైనోడు రిలీజ్ అయ్యి ఆరు నెలలు దాటిపోయినా ఇంకా ఈ ప్రాజెక్టు మొదలుకాలేదు.

నిర్మాత విషయంలో మార్పులు కారణంగా ఈ సినిమా ప్రారంభం ఆలస్యం కాగా.. ఇప్పుడీ చిత్రానికి పూజా కార్యక్రమాలు చేసినట్లు.. బోయపాటు ప్రకటించడమే కాదు.. సోషల్ మీడియాలో ఫోటోలు కూడా షేర్ చేశాడు. ద్వారకా క్రియేషన్స్ పతాకంగా మిర్యాల రవీంద్రారెడ్డి నిర్మాణంలో బోయపాటి-బెల్లంకొండ మూవీ తెరకెక్కనుండగా.. ఇప్పుడీ చిత్రానికి ముహూర్తం షాట్ తీశామంటున్నాడుబోయపాటి. కానీ అసలు సమస్యేంటంటే.. ఇప్పటికి ఇలా ముహూర్తం షాట్ లు తీయడం ఇది నాలుగోసారి. ఈ ప్రాజెక్టుకు వచ్చిన సమస్య ఏంటో బయటకు తెలీడం లేదు కానీ.. నిర్మాత మారిపోవడం.. కొత్త ప్రొడ్యూసర్ రావడం.. పూజా కార్యక్రమాలు చేయడం.. మళ్లీ ఇదే సీన్ రిపీట్.

ఇలా ఇప్పటికి ముగ్గురు ప్రొడ్యూసర్లు మారి.. నాలుగో నిర్మాతగా మిర్యాల రవీంద్రారెడ్డి ఎంటర్ అయ్యారు. మరి ఈ సారైనా ముహూర్తం గట్టిగా చూసుకుని సెట్ చేసుకున్నాడో లేదో తెలీదు కానీ.. ఈ నెల 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పాడు బోయపాటి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News