10 కోట్లు ప్రాఫిట్ అనేశాడు కానీ!?

Update: 2018-12-08 01:30 GMT
    బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ హీరోగా న‌టించిన `క‌వ‌చం` ఈ శుక్ర‌వారం రిలీజైంది. ఇది అత‌డి కెరీర్ ఐదో సినిమా. అల్లుడు శీను - స్పీడున్నోడు - జ‌య‌జాన‌కి నాయ‌క‌ సాక్ష్యం .. ఆ త‌ర్వాత‌ ఈ వ‌రుస‌లోనే వ‌చ్చిన చిత్ర‌మిది. కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ కి అవ‌కాశం ఇచ్చినందుకు బాగా తీశాడు... నిర్మాత‌లు ముందే ప్రీ బిజినెస్ బాగా చేశారు... రిలీజ్ ముందే సేఫ్ అయ్యామ‌ని మీడియా ఇంట‌రాక్ష‌న్‌లో చెప్పాడు యువ‌ హీరో శ్రీ‌నివాస్. అయితే క‌వ‌చం రిపోర్ట్ ఏంటి?  అంటే.. స‌మీక్ష‌ల ప‌రంగా క్రిటిక్స్ పెద‌వి విరిచేసిన సంగ‌తి తెలిసిందే.

 10 కోట్ల ప్రాఫిట్ తో ఉన్నాం.. 15కోట్ల మేర శాటిలైట్-డిజిట‌ల్ అమ్మేశామ‌ని చెప్పిన బెల్లంకొండ ఈ సినిమా పై పెట్టిన పెట్టుబ‌డి అయినా తిరిగి తెస్తాడా? అంటూ అప్పుడే చ‌ర్చ సాగుతోంది. ప‌వ‌ర్‌ ఫుల్ కాప్ డ్రామా కోసం ఈ యంగ్ హీరో చాలానే శ్ర‌మించాడు. బాడీ పెంచి లుక్ మార్చాడు. హార్డ్ వ‌ర్క్ చేశాడు. సినిమాని రిచ్ లుక్‌ తోనే తీశారు. కానీ ఫ‌లితం మాత్రం ఆశించిన‌ట్టుగా లేద‌న్న మాటా అప్పుడే బ‌య‌టికి వ‌చ్చింది. మొద‌టిరోజు ఎంత ఊపు ఉంది? అంటే చెప్ప‌లేని ప‌రిస్థితి.

    `క‌వ‌చం` చిత్రాన్ని 16కోట్ల‌కు థియేట్రిక‌ల్ రైట్స్ అమ్మారు. ఆ మొత్తం థియేట‌ర్ల నుంచే తేవాల్సి ఉంటుంది. కానీ తొలిరోజు డివైడ్ టాక్ తో ఈ సినిమా స‌న్నివేశ‌మేంటో అర్థం కాని విధంగా ఉంద‌ని ట్రేడ్ చెబుతోంది. నైజాం నుంచి 5కోట్లు - సీడెడ్ నుంచి 3కోట్లు (నాన్ రిఫండ‌బుల్‌) - ఆంధ్రా ఏరియా నుంచి 7కోట్లు (రేషియో) ప్రీరిలీజ్‌ బిజినెస్ సాగింది. మొత్తం ఏపీ-తెలంగాణ‌కు 15కోట్ల మేర బిజినెస్ చేశారు. క‌ర్నాట‌క‌ - ఉత్త‌ర భార‌త‌దేశం క‌లుపుకుని మ‌రో 1.1కోట్లు వ‌చ్చింద‌ట‌. అంటే ఆ మేర‌కు ఆ మొత్తాల్ని షేర్ రూపంలో తిరిగి థియేట‌ర్ల నుంచి తేవాల్సి ఉంటుంది. కానీ తొలిరోజు టాక్‌ ని బ‌ట్టి ఆ సీన్ ఉంటుందా? అంటూ పెద‌వి విరిచేస్తున్నారు. క‌వ‌చంతో పాటు మ‌రో మూడు సినిమాలు వ‌చ్చాయి. వాటి ప‌రిస్థితి సోసోనే కాబ‌ట్టి, అదేమైనా ఈ యాక్ష‌న్ చిత్రానికి ప్ల‌స్ అవుతుందేమో చూడాల‌న్న విశ్లేష‌ణ సాగుతోంది.

   

Tags:    

Similar News