పంచ భూతాల నేపధ్యంలో ఫాంటసీ కథతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందిన సాక్ష్యం మంచి ఓపెనింగ్స్ తో ప్రారంభం కావడం పట్ల ట్రేడ్ ఆనందంగా ఉంది. వసూళ్లకు సంబంధించిన లెక్కలు ఇంకా బయటికి రాకపోయినా అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ నెంబర్ రికార్డు అయినట్టుగా సమాచారం. ముఖ్యంగా మాస్ ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ దక్కుతున్నట్టుగా స్పందనను బట్టి తెలుస్తోంది. సాయి శ్రీనివాస్ పెర్ఫార్మన్స్ కి తోడుగా పూజా హెగ్డే గ్లామర్ రివెంజ్ ఫార్ములాను గ్రాఫిక్స్ నేపధ్యంలో డిజైన్ చేసిన తీరు వాళ్ళను బాగా మెప్పిస్తోంది. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ కి తోడు దర్శకుడు శ్రీవాస్ టేకింగ్ కనెక్ట్ అయ్యేలా ఉండటంతో ఈ రోజు కూడా స్టడీగానే ఉంది. నిన్న సాక్ష్యంతో పాటు మోహిని మిషన్ ఇంపాజిబుల్ ఫాలెన్ అవుట్ నుంచి పోటీ ఉన్నా కూడా సాక్ష్యందే తెలుగు రాష్ట్రాల్లో డామినేషన్ గా ఉంది. వీక్ ఎండ్ మొత్తం కంట్రోల్ లోకి తీసుకున్న సాక్ష్యం సోమవారం కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ చేస్తే పూర్తిగా సేఫ్ అయినట్టే.
కొత్త సినిమాలకు డివైడ్ టాక్ రావడం ఫ్యామిలీ స్ కూడా సాక్ష్యం వైపు టర్న్ అవుతున్నట్టు ఆ రిపోర్ట్స్ రావడం సానుకూలంగా ఉంది. రివెంజ్ ఫార్ములానే అయినప్పటికీ పంచ భూతాల సహాయంతో హీరో తనకు తెలియకుండా ప్రతీకారం తీర్చుకోవడం అనే పాయింట్ బాగా వర్క్ అవుట్ అవుతోందని చెప్పాలి. హర్షవర్ధన్ సంగీతం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకుంటున్నారు. ఇక బెల్లంకొండ హీరోకు మంచి టర్నింగ్ పాయింట్ లాగా నిలిచేలా కనిపిస్తున్న సాక్ష్యం పూర్తి రేంజ్ ఏంటో తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాక పూర్తి క్లారిటీ వస్తుంది.