మాస్ రాజా రవితేజ మళ్లీ ఫామ్ లోకి వచ్చేశాడు. ‘కిక్-2’తో దారుణమైన ఫలితాన్ని ఖాతాలో వేసుకున్న రవితేజ.. ‘బెంగాల్ టైగర్’తో మళ్లీ తన బాక్సాఫీస్ పవర్ చూపిస్తున్నాడు. ఈ సినిమా తొలి రోజు రవితేజ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా బెంగాల్ టైగర్ తొలి రోజు రూ.6.5 కోట్ల షేర్ కలెక్ట్ చేయడం విశేషం. ఇంతకుముందు రికార్డు కిక్-2 పేరిటే ఉంది. ఆ సినిమా రూ.5.7 కోట్ల దాకా వసూలు చేసింది. బెంగాల్ టైగర్ రెండు తెలుగు రాష్ట్రాల వసూళ్లే ఆ మార్కుకు దగ్గరగా ఉండటం విశేషం.
నైజాంలో తొలి రూ.2.2 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది మాస్ రాజా సినిమా. సీడెడ్ వసూళ్లు రూ.90 లక్షలున్నాయి. ఆంధ్రాలోని అన్ని ఏరియాలు కలిపి రూ.2.1 కోట్ల దాకా షేర్ కలెక్టయింది. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల షేర్ రూ.5.4 కోట్ల దాకా ఉంది. కర్ణాటక - అమెరికా - ఇతర ఏరియాలు కలిపితే లెక్క రూ.6.5 కోట్ల దాకా ఉంది. గ్రాస్ వసూళ్లు దాదాపు రూ.10 కోట్ల మార్కును టచ్ చేశాయి. పాజిటివ్ టాక్ తో నడుస్తుండటం.. మాస్ ఆడియన్స్ సినిమాకు బ్రహ్మరథం పడుతుండటంతో బెంగాల్ టైగర్ రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచే అవకాశాలున్నాయి. ఇప్పటిదాకా మాస్ రాజా కెరీర్లో బలుపు అత్యధికంగా రూ.28 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.