మాస్ రాజా మళ్లీ వచ్చేశాడు. ‘కిక్-2’ మిగిల్చిన డిజప్పాయింట్మెంట్ మొత్తం కవరైపోయేలా.. పవర్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికే ‘బెంగాల్ టైగర్’ రూపంలో వస్తున్నాడు రవితేజ. ముందు అన్నట్లే ఈ రోజు ఉదయం పదిన్నరకు ‘బెంగాల్ టైగర్’ టీజర్ రిలీజైంది. ‘ఇదో పక్కా నాన్ వెజ్ సినిమా’ అన్న మాస్ రాజా.. అందుకు తగ్గట్లే కనిపించాడు మాస్ రాజా. నిమిషం పాటు సాగే టీజర్ చాలా పవర్ ఫుల్ గా, ఎంటర్టైనింగ్ గా ఉంది. మాస్ ప్రేక్షకుల్ని అలరించడమే ఏకైక ధ్యేయంగా సినిమా తెరకెక్కినట్లుంది. అలాగే మాస్ రాజాను ఎన్నడూ లేనంత స్టయిల్ గా చూపించే ప్రయత్నం కూడా జరిగింది.
‘‘నేను క్లైమాట్ లాంటోణ్ని. కొన్నిసార్లు చల్లగా ఉంటా. కొన్నిసార్లు వెచ్చగా ఉంటా. అలాగే కొన్నిసార్లు వణికించేస్తా’’ అంటూ రవితేజ తనదైన స్టయిల్లో డైలాగులు చెబుతుంటే దానికి తగ్గట్నే షాట్లు కట్ చేశారు. చివర్లో కొసమెరుపులో తమన్నా వచ్చి అందాల వల విసిరింది. తెల్ల చీరలో చాలా సెక్సీగా ఉన్న తమన్నాను చూస్తే కుర్రాళ్లు కుదురుగా కూర్చోవడం కష్టం. ‘రచ్చ’ సినిమాలో వానా వానా వెల్లువాయె తరహా పాట ఒకటి ప్లాన్ చేసినట్లున్నాడు సంపత్ నంది. మొత్తానికి ఇంకో మూడు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘బెంగాల్ టైగర్’ టీజర్ తో బాగానే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.