వర్దమాన నటి పై గ్యాంగ్ రేప్ ...వీడియో నెట్లో పెడతామంటూ బెదిరింపులు!

Update: 2020-07-10 13:00 GMT
ఈ సమాజంలో అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ప్రత్యేకంగా ఎన్ని చట్టాలు తీసుకువస్తున్నా , కామాంధులని ఎన్ కౌంటర్ చేస్తున్నా కూడా కొందరు మానవ మృగాలు ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఆడవారి రక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తున్నప్పటికీ , వాటికీ ఎవరు భయపడటం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. తాజాగా ఓ 26 ఏళ్ల బెంగాళీ నటి పై కొంతమంది అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి..ఆ సమయంలో వీడియో తీసి , ఈ విషయాన్ని బయటకి చెప్తే ఆ వీడియోను వైరల్ చేస్తామని బెదిరించారు.

ఈ దారుణమైన సంఘటన బిజోయ్ ఘర్ ప్రాంతంలో జులై 5న జరిగింది. ఈ మేరకు నటి జాదవ్‌ పూర్ పోలీస్ స్టేషన్ ‌లో జూలై 8 కంప్లయింట్‌ నమోదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆ బాధిత నటి సాత్‌ బాయ్‌ చంపా అనే టెలివిజన్‌ సీరియల్ ‌లో లీడ్ రోల్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఘటన పై పూర్తీ వివరాలు చూస్తే .. జులై 5న కొందరు దుండగులు ఆ నటి నివస్తున్న ఫ్లాట్ ‌కు వచ్చి కొంత ఆర్థిక సాయం చేయాలంటూ కోరారు. ఆ తర్వాత ఇంట్లో ఆ నటి ఒంటరిగా ఉన్న విషయం గమనించి, అందరూ కలిసి ఆమె పై ఈ దారుణానికి ఒడిగట్టారని తెలుస్తుంది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కూడా అత్యాచారం జరిగిన సమయంలో తాను ఒంటరిగానే ఉన్నట్లు తెలిపింది. ఆ దుండగులు తనను అత్యాచారం చేయటం మాత్రమే కాదు. ఆ ఘటనను వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించారని చెప్పింది.

ఆ నటి ఇచ్చిన ఫిర్యాదుతో నిందితులపై ఇండియన్ పీనల్‌ కోర్ట్‌ సెక్షన్‌ 306/506 కేసు నమోదు చేసినట్టుగా వెల్లడించారు పోలీసులు. ప్రాథమిక విచారణ లో నిందితుడు నటికి పరిచయస్తుడే అని తేలినట్టుగా పోలీసులు వెల్లడించారు. నింధితుడు బిజినెస్‌ మేన్‌ అని అతడు నటి తో గతంలో సన్నిహితంగా ఉండేవాడని, కానీ కొన్ని కారణాల తో వారిద్దరు విడిగా ఉంటున్నారని తెలిపారు. దీనిపై పూర్తీ వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం అని తెలిపారు.
Tags:    

Similar News