దీపిక‌.. షారుఖ్ ల‌ని గ‌ట్టిగా ఏకిపారేస్తున్నారుగా

Update: 2022-12-13 12:30 GMT
సోష‌ల్ మీడియా వ‌చ్చాక సెల‌బ్రిటీలు ఉ చిన్న త‌ప్పు చేసినా అడ్డంగా బుక్క‌వుతున్న విష‌యం తెలిసిందే. ఏ చిన్న పోస్ట్ పెట్టినా.. వీడియో రిలీజ్ చేసినా నెటిజ‌న్ లు ల‌క్ష క‌ళ్ల‌తో చూసి అందులో ఎన్ని బొక్క‌లున్నాయో వెతికి ప‌ట్టేసి సెల‌బ్రిటీల‌ని ఉతికి ఆరేస్తున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ ఖిలాడీ హీరో అక్ష‌య్ కుమార్ .. ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హ‌రాజ్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెర‌కెక్కుతున్న మూవీ `వేద‌త్ మ‌రాఠే వీర్ దౌద‌లే సాత్‌` పేరుతో రూపొందుతున్న మూవీ ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేసి అడ్డంగా నెటిజ‌న్ ల‌కు దొరికి పోయి దారుణ ట్రెలింగ్ కి గురైన విష‌యం తెలిసిందే.

దీంతో జ‌రిగిన త‌ప్పు తెలుసుకున్న అక్ష‌య్ కుమార్ నాలుక క‌రుచుకున్నాడు. అయినా స‌రే నెటిజ‌న్ ల ట్రోలింగ్ ఆగ‌లేదు. తాజాగా బాలీవుడ్ క్రేజీ స్టార్స్ దీపికా ప‌దుకునే, షారుఖ్ ఖాన్ లు కూడా నెటిజ‌న్ ల‌కు అడ్డంగా బుక్క‌య్యారు. షారుఖ్ ఖాన్ న‌టిస్తున్న లేటెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `ప‌ఠాన్‌`. సిద్ధార్ద్ ఆనంద్ డైరెక్ష‌న్ లో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. 2023 జ‌న‌వ‌రి 23న ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

హిందీ, త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో రిలీజ్ కానున్న ఈ మూవీకి సంబంధించిన ఫ‌స్ట్ సింగిల్ `బేష‌ర‌మ్ రంగ్‌` అంటూ సాగే బీచ్ సాంగ్ ని తా.గా రిలీజ్ చేశారు. ఈ పాట‌లో దీపిక‌, షారుఖ్ ల కెమిస్ట్రీ అదిరింది. షారుఖ్ న‌టించిన `ఓం శాంతి ఓం`తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన దీపిక `చెన్నై ఎక్స్ ప్రెస్‌`, హ్యాపీ న్యూఇయ‌ర్‌` సినిమాల త‌రువాత నాలుగ‌వ సారి క‌లిసి న‌టిస్తున్న మూవీ ఇది. షారుక్ కూడా నాలుగేళ్ల విరామం త‌రువాత చేస్తున్న సినిమా కావ‌డంతో ఈ మూవీని ప్ర‌త్యేకంగా చూస్తున్నాడు.

ఇదిలా వుంటే తాజాగా విడుద‌ల చేసిన సాంగ్ షారుఖ్ , దీపిక‌ల కెమిస్ట్రీ, దీపిక బిజినీలో అందాలు ఆర‌బోస్తూ .. ఒక విధంగా చెప్పాలంటే దీపిక చాలా వ‌ర‌కు షాకింగ్ క్లాత్స్ తో అంగాంగ ప్ర‌ద‌ర్శ‌న చేస్తూ సిజ్లింగ్ డ్యాన్స్ మూవ్స్ తో అద‌ర‌గొట్టేసింది. అయితే ఈ పాట‌లోని చివ‌రి ఎండింగ్ లో దీపిక తై షో చేస్తూ కాషాయ క‌ల‌ర్ డ్రెస్ లో క‌నిపించింది. ఇదే ఇప్ప‌డు నెట్టింట ట్రోల్ కి గుర‌య్యేలా చేస్తోంది. కాషాయ క‌ల‌ర్ డ్రెస్ పీలిక‌ల్లో దీపిక క‌నిపిస్తూ వ‌ల్గ‌ర్ మూవ్స్ తో క‌నిపించిన తీరు నెటిజ‌న్ ల‌కు ఆగ్ర‌హాన్ని తెప్పిస్తోంది.

త‌న‌కంటే వ‌య‌సులో పెద్ద వాడైన‌టువంటి షారుఖ్ తో దీపికి ఇలాంటి డ్రెస్ తో వ‌ల్గ‌ర్ భంగిమ‌తో డ్యాన్స్ చేయ‌డం క‌రెక్ట్ గా లేద‌ని నెటిజ‌న్ లు మండిప‌డుతున్నారు. ఏజ్ బార్ షారుఖ్ తో దీపిక ఇవేం వేశాలంటూ  సోష‌ల్ మీడియా వేదిక‌గా షారుఖ్ ని, మేక‌ర్స్ ని ఏకి పారేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    

Similar News