"కేవలం 2% సక్సెస్ రేట్ వున్న ఇండస్ట్రీలో బ్రతుకుతున్నాం" నేనింతే సినిమాలో ఒక నిర్మాత ఆవేశంతో పలిక్ సంభాషణ ఇది. నిజమే ఏడాది పొడుగునా వందల సంఖ్యలో సినిమాలు విడుదలవుతున్నా వాటిలో విజయం సాధించేవి మాత్రం పదుల సంఖ్యలోనే వుంటున్నాయి. ఈ ఏడాది కూడా అందుకు మినహాయింపుకాదు. రోజులో 24గంటలూ తమ ఇండస్ట్రీలో వున్న 24రీళ్ళ గురించి కలలుగంటూ బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వాలని తపించే ఎంతోమంది దర్శకుల మధుర జ్ఞాపకాలుగా 2015సంవత్సరం నిలిచింది. చొక్కా మడతపెట్టే మాస్ కావచ్చు.. చక్కగా కూర్చోబెట్టి అలరించే క్లాస్ కావచ్చు.. ఏ జోనర్ తీసుకున్నా ఈ ఏడాది ప్రేక్షకులని అలరించిన/ ప్రేక్షకులు ఆదరించిన టాప్ మూవీస్ ఏంటో ఓ లుక్కేద్దామా?
పటాస్:
కల్యాణ్ రామ్ సినిమాలు అయితే సూపర్ హిట్లు.. లేకపోతే అట్టర్ ఫ్లాపులు.. ఇలా జడ్జిమెంట్ పీక్స్ లో వున్న కుర్రోడి నుండి మాస్ మసాలా సినిమా అనగానే కాస్త వెనక్కి తగ్గినా జనం సినిమాలో కంటెంట్ వుండేసరికి నీరాజనంపట్టారు. పటాస్ సినిమానుఈ ఏడాది తొలి హిట్ గా నిలపడమేకాక దర్శకుడిపై ప్రశంసల వర్షం కురిపించారు.
100% టైం పాస్..
నందమూరి - రావిపూడి ల పక్కా మాస్ ..
కమర్షియల్ హంగులకు సూపర్ హిట్ రూపం పటాస్..
టెంపర్:
ఆకలి మీదున్న తారక్ అనే సింహానికి ఎమోషన్స్ ని ఏపుగా నింపిన టెంపర్ లాంటి స్టోరీని ఇస్తే ఎలా వుంటుంది ..కెరీర్ బ్లాక్ బస్టర్ గా మారుతుంది. సోషల్ ఎలిమెంట్ కి కమర్షియల్ హంగులు ఏర్పరిచి పూరి టెంపర్ తో సక్సెస్ కొట్టడమేకాక తారక్ కి కెరీర్ బెస్ట్ మూవీని అందించాడు.
వంశీ, పూరి ల పెన్ పవర్..
తారక్ నటన సూపర్ డూపర్..
అభిమానులను ఆద్యంతం అలరించిన టెంపర్..
మళ్ళి మళ్లి ఇది రానిరోజు:
కమర్షియల్ సూత్రాలకు భిన్నంగా, ఫైట్ లు, ఫీట్లకు దూరంగా, బూతు జోకుల జోలికిపోకుండా ప్రేక్షకుడికి మధురానుభూతిని కలిగించిన సినిమా మళ్ళి మళ్లి ఇది రానిరోజు. క్రాంతిమాధవ్, సాయి మాధవ్ ల కలానికి ఈ కాలం జోహార్లు చెప్పింది. శర్వానంద్, నిత్యల నటనకు జేజేలు కొట్టింది.
వదిలించింది తెలుగు సినిమాలకు పట్టిన బూజు..
మృదుమధురమైన ప్రేమకధా చిత్రానికి చక్కని రివాజు
మళ్ళి మళ్లి ఇది రానిరోజు..
గంగ:
డబ్బులిచ్చి మరీ భయపడమంటే ముందుండేవారిలో తెలుగు ప్రేక్షకులు ఒకరు. రెబల్ వంటి డిజాస్టర్ తరువాత వచ్చినా ముని సిరీస్ కున్న పేరుతొ గంగ సినిమాకు మంఛి రేస్పాన్సే వచ్చింది. ఈ ఏడాది ఎక్కువ విజయం సాధించిన డబ్బింగ్ సినిమాగా గంగ నిలుస్తుంది. తాప్సీ అందాలు, నిత్య నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు.
తీర్చింది హిట్టు లేదనే లారెన్స్ బెంగ
భయపెట్టింది ప్రేక్షకులను సుబ్బరంగా
ముని సిరీస్ లో బెస్ట్ హర్రర్ పిక్చర్ ఈ గంగ..
బాహుబలి:
ఈ సినిమా గురించి కొత్తగా మాట్లడుకోవాల్సింది ఏమి లేదు. తెలుగు వాడి పేరు ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టిన తెలుగు వారి పేర్లలో రాజమౌళి నామధేయం కూడా చేరుతుంది. పెట్టిన పెట్టుబడికి మూడింతల లాభం తీసుకురావడమేకాక తెలుగు సినిమా ఇండస్ట్రీ కలలోసైతం ఊహించలెని రికార్డులను సొంతం చేసుకున్ని సినిమా బాహుబలి..
సినిమా తీయడంలో సాహస విక్రమ ధీశాలి
యుద్ధసన్నివేశాల చిత్రీకరణలో రణతంత్ర కళా కుశలి
బహుభలే గా ప్రపంచాన్ని మెప్పించిన బాహుబలి.
శ్రీమంతుడు:
మహేష్ బాబు వంటి స్టార్ హీరోతో మాస్ ని నమ్మకుండా స్టోరీని నమ్ముకుని కధాబలంతో శ్రీమంతుడుని విజయ తీరాలకు చేర్చాడు కొరటాల. దత్తత కాన్సెప్ట్ చాలా మంది మెచ్చుకోవడమే కాక ఆచరింఛి కూడా ఈ సినిమా ప్రభావాన్ని తెలియజేసారు. మహేష్ కెరీర్ బెస్ట్ గా ఈ సినిమా నిలవడం విశేషం.
మనసున్న ధనవంతుడు..
విలువలున్న గుణవంతుడు..
ధైర్యమున్న బలవంతుడు..
దేవరకోట ప్రజలకు భగవంతుడు...
భలే భలే మగాడివోయ్:
చిన్న సినిమాలలో పెద్ద విజయం అంటూ సాగిన ఈ చిత్ర విశేషాలు కొత్తగా చెప్పుకోవడానికి ఏమి లేవు. పర్సెంటేజ్ విషయంలో పెట్టుబడికంటే వచ్చిన లాభాలను పోల్చుకుంటే ఈ సినిమా బాహుబలిని మించిపోతుంది. మతిమరపు నాని నటన, మారుతి మైమరిపింపజేసే సృజన ఈ సినిమాకు చాలా దోహదపడ్డాయి.
వరుస ఫ్లాపుల తరువాత నాని సూపర్ హిట్ కొట్టాదండోయ్..
సినిమా చూస్తున్నంత సేపు నవ్వి నవ్వి పొట్ట చక్కలవుతుందడోయ్..
ఈ ఏది స్మాల్ సైన్మా ల బ్లాక్ బస్టర్ భలే భలే మగాడివోయ్..
కుమారి 21F:
సుకుమార్ గీసిన ప్రేమగీతని రాజ్ తరుణ్, హీబా పటేల్ లు అందమైన బొమ్మగా మార్చిన చిత్రం కుమారి. నేటి యువత మనస్తత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఈ సినిమాను బోల్డ్ గా తీసిన ప్రతీ ఒక్క టెక్నీషియన్ కి మంచి పేరు లభించింది.
సినిమాకు అసలైన ఖజానా..
హీరో హీరోయిన్ల నటన
సుకుమార్ రచన
రత్నవేలు కెమెరా సృజన
దేవి అందించిన బీట్ల భజన
ఇవేకాక సినిమా సుపిస్త మావా, రుద్రమదేవి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, భలే మంచి రోజు సినిమాలు కూడా ప్రేక్షకులను అలరింఛి విజయాలను సాధించాయి.
ఇంతటి తో వర్చ్యువల్ గా సాగిన మన సంభాషణ.. న్యాచురల్ గా రాసిన మా విశ్లేషణ సమాప్తం..
నచ్చితే ఓ ముగ్గురికి షేర్ చెయ్యండి.. ఆ ముగ్గురిని మరో ముగ్గురికి షేర్ చెయ్యమనండి(ఎంతైనా సినిమా వాళ్ళంగా.. సినిమా భాషలోనే ముగిద్దాం)
వంశీ కృష్ణ దరిశిపూడి...
(తుపాకీ పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు)