బాల‌కృష్ణ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్?

Update: 2023-01-12 15:17 GMT
న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `వీర‌సింహారెడ్డి` నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఘ‌నంగా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇరు తెలుగు రాష్ట్రాలు స‌హా ఓవ‌ర్సీస్ లోను ఈ చిత్రాన్ని  ప్ర‌తిష్ఠాత్మ‌కంగా విడుద‌ల చేసారు. గ‌త కొంత‌కాలంగా ఈ సినిమాపై ఉన్న హైప్ దృష్ట్యా బాల‌య్య కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్  వ‌సూళ్ల‌ను సాధించ‌నుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

వీరసింహారెడ్డి మాస్ యాక్ష‌న్ ట్రైల‌ర్ అభిమానుల‌ను ఉర్రూత‌లూగించింది. దీంతో ఓపెనింగ్ క‌లెక్ష‌న్ల‌కు డోఖా లేద‌ని టాక్ వినిపిస్తోంది. అఖండ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత బాల‌య్య బాబు అభిమానులు ఎంతో ఆస‌క్తిగా వేచి చూసిన సినిమా ఇది. ఆహాలో అన్ స్టాప‌బుల్ విత్ ఎన్.బి.కే షోతో బాల‌కృష్ణ ఇమేజ్ అమాంతం పెరిగింది. ఇవ‌న్నీ ఈ సినిమాకి ప్ల‌స్ కానున్నాయ‌ని టాక్ వినిపిస్తోంది.

వీర‌సింహారెడ్డి అమెరికాలో ఒక మిలియ‌న్ డాల‌ర్ వ‌సూళ్ల దిశ‌గా సాగుతోంద‌ని తాజాగా ట్రేడ్ వెల్ల‌డించింది. 708కె డాల‌ర్ల‌ గ్రాస్ అమెరికా నుంచి వ‌సూలైంద‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. బాల‌య్య బాబు కెరీర్ మొత్తంలోనే బెస్ట్ ఓపెనింగులు తేనుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే ఈ సినిమా అత్యంత భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కింది. భారీ ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ఆ మేర‌కు రిట‌ర్నులు తేవాల్సి ఉంటుంది.

శ‌నివారం ఆదివారం పండ‌గ సెల‌వులు క‌లిసి రానున్నాయి. అయితే శ‌నివారం థియేట‌ర్ల‌లోకి వాల్తేరు వీర‌య్య లాంటి భారీ సినిమా విడుద‌ల‌వుతోంది. ఒక రోజు గ్యాప్ తోనే రెండు పెద్ద సినిమాలు వ‌సూళ్ల‌ను షేర్ చేసుకుంటాయి. అయితే ఈ పండ‌గ సెల‌వులు ఈ సినిమాల‌కు ఏమేర‌కు క‌లిసి రానున్నాయి? అన్న‌ది వేచి చూడాలి. సోమ‌వారం నుంచి అస‌లు ప‌రీక్ష మొద‌ల‌వుతుంది. వాస్త‌విక టాక్ తో సినిమాలు లాంగ్ ర‌న్ లో రాణించాల్సి ఉంటుంద‌ని విశ్లేషిస్తున్నారు. బ‌య్య‌ర్లు పంపిణీవ‌ర్గాలు సేవ్ అవ్వాలంటే భారీ గా షేర్ వ‌సూలు చేయాల్సి ఉంటుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News