బిచ్చగాడు హీరో విజయ్ యాంటోనీ నటించిన భేతాళుడు థియేటర్లలోకి వచ్చేసింది. వీకెండ్ కంటే ముందే రావడం కాస్త రిస్క్ అయినా.. తన సెంటిమెంట్ ప్రకారం గురువారం నాడే మూవీని రిలీజ్ చేశాడు హీరో. బిచ్చగాడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో.. టాలీవుడ్ లో భేతాలుడు బోలెడన్ని అంచనాల మధ్యే వచ్చాడు.
తొలి రోజున ఈ డబ్బింగ్ మూవీకి 1.34 కోట్ల రూపాయల వసూళ్లు దక్కాయి. డబ్బింగ్ చిత్రాల లెక్కలతో పోల్చితే ఇది ఎక్కువే కానీ.. భేతాళుడుపై ఉన్న హైప్.. ఇచ్చిన స్క్రీన్ కౌంట్ తో పోలిస్తే మాత్రం తక్కువ మొత్తమే. ఇందుకు డీమానిటైజేషన్ ప్రభావం పడిందని చెప్పక తప్పదు. ఏ సెంటర్లలో వసూళ్లు బాగానే ఉన్నా.. బీ-సీ సెంటర్లలో కలెక్షన్స్ ప్రోత్సాహకరంగా లేవు. నైజాంలో భేతాళుడు తొలిరోజున 44లక్షలు వసూలు చేయగా.. సీడెడ్ లో18 లక్షలు.. ఉత్తరాంధ్రలో 16 లక్షలు.. గుంటూరులో 18 లక్షలు.. కృష్ణాలో 13 లక్షలు.. ఈస్ట్ గోదావరి 11 లక్షలు.. వెస్ట్ గోదావరి 8 లక్షలు.. నెల్లూరు 6 లక్షలు వసూలయ్యాయి.
ఇవి భారీ ఫిగర్స్ కాకపోయినా.. ఇంకా వీకెండ్ మూడు రోజులపాటు వసూళ్లకు అవకాశం ఉండడం.. టాక్ బాగానే ఉండడం కలిసొచ్చే అంశాలు. సండే వరకూ భేతాళుడు ఎలాంటి బ్రేక్ లేకుండానే పెర్ఫామ్ చేసే అవకాశాలున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/