అమితాబ్ బచ్చన్ దేశవ్యాప్తంగా కోట్లాది అభిమానులను కలిగిన లెజెండ్. తన సినిమాలతో ఇప్పటికి అభిమానులను అలరిస్తున్న ఆయన ఎంతోమంది సినీ ప్రముఖులకు ఆదర్శ దైవంలాంటి వాడు. దేశంలో జరిగే సంఘటనల గురించి ఎల్లప్పుడూ సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తిగా.. ఒక నటుడిగా ప్రేక్షకుల గుండెల్లో గొప్ప స్థానాన్ని కలిగి ఉన్నాడు. అంతటి స్టార్ హీరో అయిన అమితాబ్.. ఒక సినిమా విషయంలో మరో హీరోకి భయపడ్డాడట. ఆ మరో హీరో ఎవరో కాదు లోకనాయకుడు కమల్ హాసన్. అయితే కమల్ కి భయపడి ఏకంగా సినిమానే వదులుకున్నాడట అమితాబ్. మరి బిగ్ బి ఎందుకు భయపడ్డాడో.. ఆయన సినిమానే వదులుకునేంత పని ఏమయ్యుంటుంది అని అందరిలో ఆసక్తి రేపుతున్న ప్రశ్న.
అమితాబ్ - కమల్ మధ్య జరిగిన విషయాన్నీ ఇటీవలే సీనియర్ స్టార్ డైరెక్టర్, యాక్టర్ భాగ్యరాజ్ ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టాడు. ఇక ఆయన మాట్లాడుతూ.. నిజానికి నేను.. అమితాబ్ - కమల్ కాంబినేషన్లో ఖబడ్ధార్ అనే సినిమా ప్లాన్ చేశాను. ఆ సినిమా కోసం ముందుగా అమితాబ్ ని సంప్రదిస్తే ఓకే అన్నాడు. అయితే పూర్తి స్క్రిప్ట్ రెడీ అయ్యాక మళ్లీ కలిస్తే అమితాబ్ నో అన్నాడు. ఎందుకంటే సినిమా క్లైమాక్స్ లో కమల్ పాత్ర చనిపోతుంది. ఆ పాత్రకి భయపడి అమితాబ్ నో అన్నాడు. కానీ కమల్ పాత్ర చనిపోతే సినిమాకి ఆ పాత్ర మాత్రమే హైలైట్ అవుతుంది. ఇంకా క్లైమాక్స్ లో కమల్ ముందు తను తగ్గిపోతానని భావించి.. సినిమాకి నో చెప్పాడని' భాగ్యరాజ్ వెల్లడించాడు. అయితే ఈ విషయం కూడా అమితాబ్ బహిరంగానే ఒప్పుకున్నట్లు ఆయన తెలిపాడు. అలా ఖబడ్ధార్ నుండి బిగ్ బి తప్పుకున్నాడట.