అందాల వెటరన్ నాయిక భాగ్యశ్రీ పరిచయం అవసరం లేదు. మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ప్రేమ పావురాలు (మై నే ప్యార్ కియా) చిత్రంతో తెలుగు వారికి ఈ సీనియర్ నటి సుపరిచితం. చాలా కాలం తర్వాత ప్రభాస్ తో కలిసి రాధేశ్యామ్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో క్లాసిక్ నటిపై తన క్రష్ గురించి ప్రభాస్ ఏమాత్రం దాచుకోలేదు. రాధేశ్యామ్ లో భాగ్యశ్రీ ఎంతో చిల్లింగ్ లుక్ తో కనిపించారు. ఏజ్ తో పని లేకుండా కుర్రాళ్లు ప్రేమలో పడాల్సిందే అన్నంత అందంగా కనిపించారు. 50 దాటినా 30 ఏళ్ల సుపుత్రులు ఉన్నా కానీ ఇప్పటికీ స్వీట్ సిక్స్ టీన్ లుక్ తో మురిపిస్తున్న భాగ్యశ్రీ వెండితెర రీఎంట్రీపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేయడం ఆసక్తికరం.
ఇకపోతే నటి భాగ్యశ్రీ దాసాని ఇప్పుడు బుల్లితెరపై అడుగుపెడుతున్నారు. తొలిసారిగా `డిఐడి సూపర్ మామ్స్` కొత్త సీజన్ కు రెమో డిసౌజా- ఊర్మిలా మటోండ్కర్ లతో కలిసి న్యాయనిర్ణేతగా కనిపించనున్నారు. డిఐడి సూపర్ మామ్స్ జడ్జిగా భాగ్యశ్రీ ఏమంటున్నారంటే.. జీ టివి ఎగ్జయిటింగ్ డ్యాన్స్ రియాలిటీ షో - డిఐడి సూపర్ మామ్స్ తో నా కెరీర్ లో మొదటిసారిగా న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టడం గర్వంగా ఉంది. మన దేశం అంతటా ఉన్న సూపర్ టాలెంటెడ్ తల్లులను కలవడానికి .. వారి కలలను సాధించడానికి వారిని ప్రేరేపించడానికి నేను నిజంగా ఎదురు చూస్తున్నాను. ఈ ప్రతిభావంతులైన మహిళలను జడ్జి చేయడం అంత తేలికైన పని కాదు. కానీ నేను నా స్థాయికి ఉత్తమంగా ప్రయత్నిస్తాను. మరీ ముఖ్యంగా ప్రముఖ కొరియోగ్రాఫర్ - రెమో డిసౌజా .. అపారమైన ప్రతిభావంతురాలు ఊర్మిళా మటోండ్కర్ తో డిఐడి కోసం వేదికను పంచుకోవడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది. సూపర్ మామ్స్... మనమంతా ఆనందకరమైన సమయాన్ని కలిగి ఉంటామని ప్రేక్షకులను అలరిస్తామని నేను కచ్చితంగా అనుకుంటున్నాను`` అని అన్నారు.
ఇప్పటికే ఈ డ్యాన్స్ రియాలిటీ షో కోసం దేశవ్యాప్తంగా ఆడిషన్స్ ప్రారంభమయ్యాయి. ఆన్ లైన్ ఆడిషన్ లు భారీ విజయాన్ని సాధించాయి. ముంబై- ఢిల్లీ- కోల్ కతా- భోపాల్- చండీగఢ్- లక్నో- గౌహతి వంటి నగరాల్లో కూడా ఆన్ గ్రౌండ్ ఆడిషన్ లు జరిగాయి. ఎంతో గొప్ప ట్యాలెంట్ ఈ వేదికపై పరిచయమవుతున్నారు. ఇలాంటి షోకి జడ్జిగా నాటి మేటి అందాల నాయిక భాగ్యశ్రీ ఎంపికవ్వడంతో షో టీఆర్పీ గ్రాఫ్ మరింతగా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.