టిప్పర్ లారీ ఎళ్లి స్కూటర్ ని గుద్దేస్తే ఎట్టా ఉంటది! నుజ్జు నుజ్జయిపోదూ? కానీ ఇక్కడ స్కూటరే ఎళ్లి టప్పిర్ లారీని గుద్దేస్తానంటోంది! వ్వాట్! అంత మొండి ధైర్యమా.. అంటారా...? అయితే డీటెయిల్స్ లోకి వెళదాం.
దాదాపు 600కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన 2.ఓ ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఆ సినిమా వస్తోంది అనగానే అటూ ఇటూ అంతా సైడిచ్చేశారు. నేను ఎదురెళతాననే మొండి ధైర్యం మాత్రం ఎవరూ ప్రదర్శించలేదు. అసలు 2.ఓ చిత్రంపై ఇప్పటివరకూ ఎన్ని నెగెటివ్ ఫీడ్ బ్యాక్ లు వచ్చినా - టెక్నికల్ అడ్డంకులు ఎదురైనా.. చివరికి ఒక్క ట్రైలర్ తో అన్నిటికీ చెక్ పెట్టేశాడు శంకర్. దీంతో నవంబర్ చివరిలో ఎవరూ రిలీజ్ లు పెట్టుకోలేదు.
కానీ ఒక్కడు మాత్రం భయపడలేదు. వర్మలా మొండికేశాడు. వర్మ వారసుడిలా ఏటికి ఎదురెళుతున్నాడు. ఇంతకీ ఆడెవడు? అంటారా? సిద్ధార్థ్.. ది డైరెక్టర్. భైరవగీత చిత్రానికి దర్శకత్వం వహించినవాడు. తెలుగు - కన్నడ - తమిళంలో ఈ చిత్రాన్ని రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. తెలుగు రిలీజ్ కి నవంబర్ 30ని లాక్ చేశాడు. 2.ఓ రిలీజైన మరునాడే భైరవగీత రిలీజవుతోంది. అందుకే అతడి మొండి ధైర్యానికి చిత్ర సమర్పకుడు రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ అంతే గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చాడు. డైనోసార్ దర్శకుడు శంకర్ తోనే పెట్టుకున్నాడు పిల్ల డైరెక్టర్ సిద్ధార్థ్. డేవిడ్ వర్సెస్ గోలియత్!! అంటూ తనదైన శైలిలో ఛమత్కరించాడు. ఈ ట్వీట్ తో పాటే అన్ని భాషల ట్రైలర్లను ప్రమోట్ చేసేశాడు తెలివైన వర్మ. ఇకపోతే ఇంత చిన్న సినిమా అంత పెద్ద సినిమాతో ఎలా పోటీపడుతుంది? అంటే ఓవర్ ఫ్లో అయ్యి ఈ థియేటర్లకు వచ్చినా చాలనుకున్నారా? అయితే భైరవగీత ట్రైలర్ ఇప్పటికే ఆకట్టుకుంది. ట్రైలర్ లో ఉన్నంత ఎమోషన్ సినిమాలో ఉంటే ఇది కూడా మరో ఆర్.ఎక్స్ 100 లా పెద్ద హిట్టవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వర్మ కథ అందించి సమర్పించిన ఈ చిత్రానికి సిద్ధార్థ్ దర్శకుడు. అభిషేక్ నామా నిర్మించారు.