క్రిస్మస్ కానుకగా విడుదలైన భలే మంచి రోజు.. వారమంతా సూబర్బ్ కలెక్షన్లతో ఆకట్టుకుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన.. ఈ కామెడీ కం థ్రిల్లర్ ను ప్రేక్షకులు సూపర్బ్ గా ఎంజాయ్ చేస్తున్నారు. మూవీకి వచ్చిన పాజిటివ్ టాక్ తో పాటు.. ప్రేక్షకుల నుంచి మౌత్ టాక్ కూడా బాగుండడంతో.. సుధీర్ బాబు సినిమా కలెక్షన్లు కుమ్మేస్తోంది.
ఎంటర్ టెయిన్ మెంట్ కి లోటు లేకపోవడంతో.. వీకెండ్స్ లో వసూళ్లు పెద్ద మ్యాటర్ కాకపోయినా.. వీక్ డేస్ లో కలెక్షన్స్ బాగుండడం చెప్పుకోదగ్గ విషయం. మిగిలిన సినిమాలు ఫెయిల్ కావడంతో పాటు.. స్క్రీన్ ల సంఖ్య కూడా పెరగడం భలే మంచి రోజుకు కలిసొచ్చిన విషయంగా చెప్పాలి. బీసీ సెంటర్లతో పాటు మల్టీప్లెక్సుల్లోనూ కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయంటే.. ఈ మూవీ ఏ రేంజ్ హిట్ అని అర్ధం అవుతుంది. ముఖ్యంగా వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయంటే.. భలే మంచి రోజు ఎలాంటి బజ్ క్రియేట్ చేసిందో తెలుస్తుంది. ఈ వారం కూడా భారీ చిత్రాలు లేకపోవడం.. హోప్స్ ఉన్న సినిమా రామ్ మూవీ నేను శైలజ మాత్రమే కావడంతో.. సెకండ్ వీక్ లోనూ భలే మంచి రోజు పెర్ఫామ్ చేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ వీకెండ్ కలెక్షన్స్ కూడా స్టడీగా ఉంటే.. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు భారీగా లాభాలు వస్తాయంటున్నారు ఇండస్ట్రీ జనాలు.
భలే మంచి రోజును కొత్త డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య పిక్చరైజేషన్ స్టైల్ కు ఆడియన్స్ జై కొడుతున్నారు. సుధీర్ బాబు కెరీర్ లో మరో మంచి హిట్ గా ఈ చిత్రం నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వామిక ఈ మూవీలో హీరోయిన్ గా నటించగా.. సాయి కుమార్ ఓ కామెడీ రోల్ లో అలరించాడు.