ఫస్ట్ డే: మహేష్ కెరీర్ బెస్ట్ భరత్

Update: 2018-04-21 07:22 GMT
నిన్న ‘భ‌ర‌త్ అనే నేను’ అంటూ ముఖ్య‌మంత్రి హోదాలో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేశాడు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు. మంచి కంటెంటూ- కాన్సెప్టు ఉన్న‌ సినిమాలో న‌టించాడంటూ అంద‌రి ప్ర‌శంస‌లూ అందుకుంటున్నాడు. క్లాస్ పొలిటిక‌ల్ డ్రామాలో మాస్ అంశాలు మిస్ కాకుండా డీల్ చేసిన‌ ద‌ర్శ‌కుడు కొరిటాల శివ ప‌నిత‌నానికీ మంచి మార్కులే ప‌డ్డాయి. అనుకున్న‌ట్టుగానే క‌లెక్ష‌న్ల విష‌యంలోనూ కుమ్మేశాడు మ‌హేష్‌. మెసేజ్ ను కమర్షియల్ యాంగిల్ లో చెప్పే కొరటాల మేకింగ్.. మహేష్ బాబుకు బాగానే అచ్చొచ్చింది. నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర మంచి స్టార్ట్ నే నమోదు చేసింది. కొన్ని ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డులను సైతం నమోదు చేయడం విశేషం.

నైజాం ఏరియా నుంచి తొలిరోజున 4.48 కోట్ల షేర్ రాబట్టాడు భరత్. ఉత్తరాంధ్ర 2.91 కోట్లు - ఈస్ట్ 3.21 కోట్లు - వెస్ట్ 1.82 కోట్లు - కృష్ణా 1.93 కోట్లు - గుంటూరు 4.04 కోట్లు - నెల్లూరు 0.88 కోట్లు - సీడెడ్ నుంచి 2.47 కోట్లు వచ్చాయి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ నుంచి 17.79 కోట్ల షేర్ వసూలు కావడం హైలైట్ గా చెప్పాలి. అక్కడ రోజుకు ఐదుషోలకు పర్మిషన్ ఉండడంతో ఏపీ షేర్ ఎక్కువగా ఉంది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుంచే మొదటి రోజున 21.74 కోట్ల షేర్ ను కొల్లగొట్టాడు మహేష్ బాబు. ఇది మహేష్ కు కెరీర్ బెస్ట్ కావడం విశేషం. ఇక గ్రాస్ పరంగా చూస్తే తొలి రోజున 31.9 కోట్లు వచ్చాయి.

కృష్ణా-గుంటూరు జిల్లాలలో అయితే మహేష్ తన సత్తాను మరీ ఎక్కువగా చూపించేశాడు. ఇక్కడ ఫస్ట్ డే వసూళ్లలో నాన్ బాహుబలి రికార్డులు భరత్ అనే నేను సొంతం అయిపోయాయి. ఇదే ఊపు వీకెండ్ వరకూ కొనసాగితే.. సినిమా సేఫ్ జోన్ లోకి వచ్చేయడం తేలిక అయిపోతుంది. వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ రైట్స్ ను 100 కోట్లకు విక్రయించడంతో.. హిట్ రేంజుకు చేరాలంటే కచ్చితంగా ఇండస్ట్రీ  హిట్ కొట్టాల్సిన అవసరం భరత్ కు ఉంది.

అయితే తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే.. ఆల్ టైమ్ హాయ్యెస్ట్ షేర్ సాధించిన చిత్రాల ప‌రంగా టాప్‌- 5 ప్లేస్ రికార్డు మిస్స‌య్యాడు భ‌ర‌త్‌. మొద‌టి రోజే ఏకంగా 42.87 కోట్ల షేర్ సాధించి ఎవ్వ‌రికీ అంద‌నంత ఎత్తులో ఉంది ఆల్ టైమ్ ఇండ‌స్ట్రీ హిట్ ‘బాహుబ‌లి 2’. ప‌వ‌న్ క‌ల్యాణ్‌- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో సంక్రాంతి బ‌రిలో నిలిచిన ‘అజ్ఞాత‌వాసి’ 26.36 కోట్ల షేర్ తో రెండో స్థానంలో ఉంది. మెగాస్టార్ క‌మ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నెం. 150’ ఫ‌స్ట్ డే 23.24 కోట్లు కొల్ల‌గొడితే... ‘బాహుబ‌లి 1’ తొలిరోజు 22.40 కోట్లు సాధించింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ కాట‌మ‌రాయుడు 22.27 కోట్ల షేర్ సాధించి టాప్ 5లో ఉంది.

ఎన్.టీ.ఆర్ త్రిపాత్రాభిన‌యం చేసిన ‘జైల‌వ‌కుశ‌’ 21.81 కోట్ల షేర్ తో ఆరో స్థానంలోఉంది. ఇప్పుడు భ‌ర‌త్ ఆ త‌ర్వాతి స్థానంలో వ‌చ్చి సెటిల్ అయ్యాడు. మ‌హేష్ అభిమానులకు ఇది చేదు వార్తే అయినా సినిమాకి వ‌చ్చిన టాక్ ప‌రంగా చూస్తే భ‌ర‌త్ మున్ముందు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర విజృంభించే అవ‌కాశం చాలానే ఉంది.
Tags:    

Similar News