నాన్ స్టాప్ భరత్ - 7 రోజుల వసూళ్లు

Update: 2018-04-27 12:43 GMT
మహేష్ బాబు ఫ్యాన్స్ రెండేళ్ళ తర్వాత వచ్చిన బ్లాక్ బస్టర్ భరత్ అనే నేను రిజల్ట్ పట్ల యమా హ్యాపీగా ఉన్నారు. పైకి హడావిడి కనిపించకపోయినా సైలెంట్ కిల్లర్ లాగా భరత్ అనే నేను తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. రంగస్థలం వచ్చిన 20 రోజులకు భరత్ వచ్చాడు కాబట్టి పరస్పర ప్రభావం పెద్దగా ఏమి లేదు. కాకపోతే మొదరి రెండు రోజులు టాలీవుడ్ లో ఇతర విషయాల గురించి ఎక్కువ చర్చ జరగడంతో పాటు సాయంత్రం అయితే చాలు క్రికెట్ ప్రేమికులు మొత్తం ఐపిఎల్ నామస్మరణ చేస్తూ ఉండటం ఈవెనింగ్ షోస్ మీద ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా సన్ రైజర్స్ మ్యాచ్ ఉన్న ప్రతి సాయంత్రం అన్ని సినిమాల కలెక్షన్స్ లో డ్రాప్ ఉంటోందని ట్రేడ్ చెబుతోంది. ఇక భరత్ అనే నేను ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యింది కాబట్టి విశ్వసనీయ సమాచారం మేరకు వసూళ్లు ఈ రకంగా ఉన్నాయి

ప్రాంతం           షేర్               గ్రాస్

                  (కోట్లలో)         (కోట్లలో)

నైజాం             14.30            22.3

సీడెడ్             6.95             9.4

వైజాగ్             6.6

ఈస్ట్               5.52

వెస్ట్               3.30

కృష్ణ               4.60

గుంటూర్         6.80

నెల్లూరు          1.95

ఆంధ్రా             28.80           42.2

తెలుగు రాష్ట్రాలు 50.4             73.9

యుఎస్          10.23            18.6

కర్ణాటక            6.8               12.5

రెస్ట్ అఫ్ వరల్డ్    4.8               11.9

ప్రపంచవ్యాప్తంగా 71.86             116.9

థియేట్రికల్ బిజినెస్ వంద కోట్లకు పైగా జరిగిన నేపధ్యంలో ఇంకో ముప్పై వస్తే భరత్ అనే నేను పూర్తిగా లాభాల్లోకి అడుగు పెడతాడు. ఇప్పుడున్న జోరు చూస్తే అదేమీ అసాధ్యం కాదు. పైగా పోటీ సినిమాలు ఏవి పెద్దగా లేకపోవడం నా పేరు సూర్యకు మరో వారం దాకా సమయం ఉండటం ఇక్కడ ప్లస్ గా మారనుంది. ఇండస్ట్రీ హిట్ వైపు దూసుకుపోతున్న భరత్ అనే నేను రికార్డు స్టేటస్ తెలియాలంటే మరో వారం ఆగితే పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది.

Disclaimer: Figures mentioned here have been collected from few sources and also include estimates. Authenticity can't be guaranteed...!
Tags:    

Similar News