భరత్ అనే నేను ఆడియో.. పొలిటికల్ వేదికలో

Update: 2018-03-29 07:23 GMT
‘భరత్ అనే నేను’ జానర్ పొలిటికల్ డ్రామానే కానీ.. ఈ సినిమా ఆడియో వేడుక వ్యవహారం మాత్రం థ్రిల్లర్ సినిమాలా సాగుతోంది. ఈ వేడుక ఎక్కడ నిర్వహిస్తారనే విషయంపై వారం రోజులుగా రసవత్తర డ్రామా నడుస్తోంది. ముందు విశాఖపట్నంలో ఈ వేడుక చేయాలని అనుకున్నారు. కానీ అక్కడ చేస్తే ప్రత్యేక హోదా నినాదాలు గట్టిగా వినిపిస్తాయని.. మొన్న ‘రంగస్థలం’ వేడుక సందర్భంగా చిరంజీవి లాగే మహేష్ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని విజయవాడకు వేదికను మార్చాలనుకున్నారు. అక్కడ పర్మిషన్ల కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. కానీ అక్కడ కూడా ఇబ్బందులు తలెత్తుతాయేమో అని మళ్లీ ఆలోచన మార్చుకున్నారు.

చివరికిప్పుడు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ‘భరత్ అనే నేను’ ఆడియో వేడుక చేయాలని ఫిక్సయినట్లు సమాచారం. ఏప్రిల్ 7న ఈ వేడుక జరగనుంది. ఒకప్పుడు క్రికెట్ మ్యాచ్‌ లకు ఆతిథ్యమిచ్చిన ఎల్బీ స్టేడియం గత కొన్నేళ్లుగా రాజకీయ కార్యక్రమాలకే వేదిక అవుతోంది. ఎవ్వరు ఏ మీటింగ్ పెట్టాలన్నా దీన్నే ఎంచుకుంటున్నారు. ఇక్కడ ఆడియో వేడుకలు జరిగిన దాఖలాలు లేవు. శిల్ప కళా వేదికో హైటెక్సో.. జేఆర్సీ కన్వెన్సనో ఆడియో వేడుకలకు వేదిక అవుతుంటాయి. ఐతే ఇక్కడ జనాల్ని కంట్రోల్ చేయడం ఇబ్బంది అవుతుండటంతో పెద్ద వేదిక కావాలనుకున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఆడియో వేడుక జనాల మధ్య పెద్ద ఎత్తునే చేయాలని భావిస్తున్నారు. ఆడియో వేడుక కోసం అసెంబ్లీని తలపించే సెట్టింగ్ కూడా వేయనున్నారట. అందుకే ఎల్బీ స్టేడియాన్నే వేదికగాఎంచుకున్నట్లు తెలుస్తోంది..........
Tags:    

Similar News