చాలా కాలం తర్వాత తమిళ హీరో భరత్ టాలీవుడ్ సినిమా ఒకటి చేశాడు. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన హంట్ అనే సినిమాలో ప్రేమిస్తే ఫేమ్ భారత్ ఒక కీలకపాత్రలో కనిపిస్తున్నాడు. తెలుగు నటుడు శ్రీకాంత్‌తో కలిసి ఈ సినిమాలో ఆయన కనిపిస్తున్నాడు. అయితే చాలా కాలం తర్వాత భారత్ తెలుగు ఎంట్రీ ఇస్తున్నాడని చెప్పాలి. అప్పట్లో ప్రేమిస్తే అనే సినిమాతో భారత్‌కి విపరీతమైన క్రేజ్ వచ్చింది.
తమిళంలో కాదల్ అనే పేరుతో తెరకెక్కిన సినిమాని తెలుగులో ప్రేమిస్తే పేరుతో రిలీజ్ చేయగా... అప్పట్లో సూపర్ హిట్ అవడమే కాక ప్రేమికులు అందరినీ కదిలించింది. అలాంటి సినిమా తర్వాత ఆయన తెలుగులో యువసేన అనే సినిమా చేశాడు.
కానీ అది పెద్దగా వర్కౌట్ అవలేదు. అయితే అప్పటినుంచి తమిళ సినిమాలు చేసుకుంటూ తన పని తాను చేసుకుంటూ వెళుతున్న భారత్‌కు స్పైడర్ సినిమాతో మరో అవకాశం దొరికింది.
మురగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఎస్ జే సూర్య విలన్‌గా నటించిన ఈ సినిమాలో ఎస్‌జే సూర్య తమ్ముడి పాత్రలో భారత్‌కి ఛాన్స్ వచ్చింది. నెగిటివ్ రోల్ అయినా కాదనకుండా సినిమా చేశాడు.
కానీ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో అతను అనుకున్న గుర్తింపు అయితే తగ్గలేదు. మళ్లీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు మహేష్ బావ సుధీర్ బాబు సినిమాతో మరోసారి టాలీవుడ్‌లో లక్ చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
మరి ఇన్నాళ్ల తర్వాత ఆయనకు లక్ కలిసి వస్తుందో లేదో చూడాలి. వాస్తవానికి ఆయనకి తమిళంలో కూడా ఇప్పుడు పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఒకానొక సందర్భంలో ఏడాదికి ఎనిమిది సినిమాలు చేసిన ఆయన... ఇప్పుడు ఎక్కువ సినిమాలు కూడా చేయలేకపోతున్నాడు. ఒకరకంగా చూసుకుంటే ఇది రియల్ టెస్టింగ్ టైం అని అనుకోవాలి. ఒకవేళ తెలుగు సినిమాల్లో గనుక సక్సెస్ అయితే ఇక్కడ మళ్లీ అవకాశాలు లభించే అవకాశం కూడా ఉంది. మరప్పుడు బావ సినిమా కలిసి రాలేదు. బావమరిది సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.