చీఫ్‌ మినిష్టర్ భరత్ కూడా వెళుతున్నాడు

Update: 2017-08-22 13:24 GMT
బాహుబలి సినిమా తరువాత బాలీవుడ్ మాత్రమే కాదు.. ఇండియాలోని చాలా ఇతర ఫిలిం ఇండస్ర్టీలు మన సినిమాలను కొనుక్కుని వారి బాషలో రిలీజ్ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలైతే మాత్రం ఎగబడి కొనేస్తున్నారు. అందులోనూ తెలుగు సినిమాలను హిందీలోకి డబ్ చేస్తే.. ఫ్లాప్ సినిమాలు కూడా దుమ్ములేపేస్తున్నాయి. ఆ రేంజులో మన మార్కెట్ పెరిగిందనే చెప్పుకోవాలి.

అందుకే ఇప్పుడు మహేష్‌ బాబు వంటి టాప్ స్టార్లు చేసిన సినిమాలను ముందుగానే హిందీ డబ్బింగ్ రైట్స్ కొనేస్తున్నారు. వాళ్ళు ధియేటర్లలో రిలీజ్ చేసుకుంటారో టివిల్లో వేసుకుంటారో లేదంటే యుట్యూబ్ లో అప్ లోడ్ చేసుకుంటారో కాని.. హిందా లాంగ్వేజ్ అనువాదానికి బాగానే చెల్లిస్తున్నారు. ఆల్రెడీ మురుగుదాస్ బ్రాండ్ నేమ్ కారణంగా బాలీవుడ్ లో స్పైడర్ భారీ రేటుకే అమ్ముడుపోయింది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే.. కొరటాల శివ డైరక్షన్ లో రూపొందుతున్న ''భరత్ అను నేను'' సినిమా డబ్బింగ్ రైట్స్ కూడా 16 కోట్లకు అమ్ముడుపోయాయ్. ఓ రకంగా చెప్పాలంటే మన తెలుగు హీరోలకు ఈ ప్రైస్ రావడం అంటే అది రికార్డే.

భరత్ అను నేను సినిమాలో మహేష్‌ బాబు తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు. అతని ప్రియురాలిగా కియారా అద్వానీ నటిస్తోంది. ఆల్రెడీ శ్రీమంతుడు వంటి సినిమాను మహేష్‌ తో తీసిన కొరటాల.. ఇప్పుడు ఇంకా ఛాలెంజింగ్ గా మరో సామాజిక అంశాన్ని టచ్ చేస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నాడట.
Tags:    

Similar News