ఎన్టీఆర్ బయోపిక్ లుక్ ఒక్కొక్కటీ విడుదల చేస్తుంటే ఒక్కో పాత్ర పరిచయం అవుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ - బసవతారకంతో పాటు చంద్రబాబునాయుడు, హరికృష్ణ వంటి ప్రధాన పాత్రలన్నీ పరిచయమయ్యాయి.. ఏ పాత్ర ఎవరు పోషిస్తున్నారో తేలిపోయింది. అయితే, ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఆయన పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుదీ కీలక పాత్రే. ఇంతవరకు ఆ పాత్రపై సస్పెన్స్ ఉండేది. ఈ బయోపిక్‌లో ఆ పాత్ర ప్రాధాన్యం ఎలా ఉండబోతోంది.. ఏ నటుడు ఆ పాత్రను పోషించనున్నాడన్న సస్పెన్స్ ఉండేది. తాజాగా దానికి పుల్ స్టాప్ పడింది. దగ్గుబాటి పాత్రలో భరత్ రెడ్డి నటించబోతున్నారు. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన స్టిల్స్ లో ఆయన పాత్రను పరిచయం చేశారు.
ఈ బయోపిక్ లో రెండు భాగాలున్నాయి. ఒకటి ఎన్టీఆర్ కథనాయకుడు.. అంటే సినీజీవితానికి సంబంధించింది. రెండోది రాజకీయ జీవితానికి సంబంధించినది.. అది ఎన్టీఆర్ మహానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మహానాయకుడు పార్టులో దగ్గుబాటి పాత్ర ఉంటుంది. అయితే.. ఎంచుకున్న నటుడిని బట్టి ఈ పాత్ర నిడివి - ప్రాధాన్యం చాలా తక్కువ ఉంటుందన్న అంచనాలకొచ్చారు.
బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో చంద్రబాబునాయుడు పాత్రలో దగ్గుబాటి రాణాను ఎంచుకున్నారు. హరికృష్ణ పాత్రకు కూడా కళ్యాణ్ రామ్ ను ఎంచుకున్నారు. కానీ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్రను మాత్రం భరత్ రెడ్డితో మమ అనిపిస్తున్నారు. పెద్దగా ఎవరికీ పరిచయం లేని నటుడిని ఈ పాత్రకు అనుకోవడంతో దీనికున్న ప్రాధాన్యం చాలా తక్కువన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
నిజానికి ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్ర చాలా కీలకమైనది. చంద్రబాబు కంటే ముందు ఆయనే ఎన్టీఆర్‌కు బాగా దగ్గర మనిషి. కానీ.. చంద్రబాబు ఆ తరువాత అందరినీ పక్కకు నెట్టి మొత్తం తానే అయ్యారు. అనంతరకాలంలో దగ్గుబాటి రాజకీయ జీవితం దాదాపుగా సమాప్తమైపోయింది. ఆయన భార్య పురంధేశ్వరి తండ్రి ఆశయాలకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీలో చేరి కేంద్ర మంత్రి అయ్యారు. ప్రస్తుతం అమె బీజేపీలో ఉన్నారు. కానీ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాత్రం లైమ్ లైట్లో లేరు. ఇప్పుడు ఆయన కుమారుడిని వైసీపీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేయించే యోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పైగా చంద్రబాబుతో ఆయనకు ఏమాత్రం పొసగే పరిస్థితి లేదు. దీంతో ఈ బయోపిక్‌లో ఆయన పాత్ర నామమాత్రం అని వినిపిస్తోంది.