యంగ్ హీరో శర్వానంద్ గత ఏడాది వరుసగా రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అందులో ఒకటి మల్టీస్టారర్. అయితే ఈ రెండు చిత్రాలు శర్వాకు ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయాయి. దీంతో ఈ సారి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని నమ్ముకున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం `ఆడవాళ్లు మీకు జోహార్లు`. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించారు.
ఇప్పటికే భారీ క్రేజ్ నెలకొన్న ఈ మూవీ ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శర్వా, రఫ్మిక తొలి కాంబినేషన్, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే కథ, కథనాలు, శర్వాకు అండగా వెటరన్ హీరోయన్ లు వెరసి సినిమా పై ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అయింది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రచార పర్వాన్ని హోరెత్తించారు. కొత్త పోస్టర్ లు, ట్రైలర్ రిలీజ్ . మీడియా ఇంటరాక్షన్ లతో సినిమాకు ప్రచారం మొదలుపెట్టారు. అంతా సవ్యంగానే సాగుతుందని అనుకుంటున్న తరుణంలో టీమ్ కి బిగ్ షాక్.
రాదనుకున్న `భీమ్లా నాయక్` సడన్‌గా రంగంలోకి దిగడం శర్వా టీమ్ ని కలవరానికి గురిచేసింది. భారీ క్రేజ్ వున్న హీరో పవన్ కల్యాణ్ నటించిన చిత్రం కావడం.. తనకి తోడు రానా దగ్గుబాటి, నిత్యామీనన్, సంయుక్త మీనన్ కూడా నటించడం... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు.. స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా కథా మార్పుల్లో కీలక భూమిక పోషించి ప్రాజెక్ట్ కి వెన్నుదన్నుగా నిలవడం వంటి కారణాలతో శర్వా టీమ్ కొంత కంగారు పడింది.
ముందు ఈ మూవీని ఫిబ్రవరి 25న కాకుండా ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తారని అంతా భావించారు కానీ అనూహ్యంగా ఫిబ్రవరి 25నే వస్తున్నామంటూ ప్రకటించడం పలువురిని షాక్ కు గురిచేసింది. అయితే ముందు అందరిలాగే శర్వా టీమ్ భయపడినా ఆ తరువాత ధైర్యంగానే ముందడువేసింది. `భీమ్లా నాయక్` బరిలో దిగినా తాము ఎక్కడా వెనక్కి తగ్గేది లేదన్నట్టుగా పట్టుదలతో ముందుకు వెళ్లడానికే ప్రాధాన్యత నిచ్చారు.
జోనర్ వేరు కావడం కూడా శర్వా టీమ్ ముందుకు వెళ్లడానికే మొగ్గుచూడానికి ప్రధాన కారణంగా మారింది.
అయితే ఇప్పుడు `ఆడవాళ్లు ..టీమ్ కు సరికొత్త సవాల్ ఎదురైనట్టుగా తెలుస్తోంది. ఈ మూవీ విడుదలవుతున్న రోజే బరిలోకి దిగుతున్న `భీమ్లా నాయక్`ని సోలోగా రిలీజ్ చేయాలని పక్కా ప్లాన్ తో నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఓవర్సీస్ తో పాటు గుంటూరు, ఈస్ట్.. వెస్ట్ ఏరియాల పంపిణీ హక్కుల్ని తన స్నేహితులకే తెలివిగా అప్పగించారట.
దీంతో `ఆడవాళ్లు మీకు జోహార్లు` సినిమాకు ఆయా ఏరియాల్లో బయ్యర్లు కరువైనట్టుగా తెలుస్తోంది. భీమ్లాకు ఫిక్సయిపోయిన బయ్యర్స్ శర్వా సినిమాకు సహకరించడం లేదని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే శర్వానంద్ తన చిత్ర రిలీజ్ ని వాయిదా వేసుకోక తప్పదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. `భీమ్లా నాయక్` కారణంగా శర్వాకు ఈ రకంగా కొత్త తలనొప్పులు మొదలయ్యాయని, దీని నుంచి తప్పించుకోవాలంటే రిలీజ్‌పోస్ట్ పోన్ చేసుకోవడమే ఏకైక మార్గమని చెబుతున్నారు. మరి శర్వా ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.